iDreamPost
android-app
ios-app

Shah Rukh Khan: స్టార్ హీరోల రేంజ్ లో షారుఖ్ మేనేజర్ జీతం! ఎంతో తెలుసా?

  • Published Apr 09, 2024 | 4:20 PM Updated Updated Apr 09, 2024 | 4:20 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ జీతం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. స్టార్ హీరోల రేంజ్ లో ఆమె జీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె శాలరీ ఎంతంటే?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ జీతం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. స్టార్ హీరోల రేంజ్ లో ఆమె జీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె శాలరీ ఎంతంటే?

  • Published Apr 09, 2024 | 4:20 PMUpdated Apr 09, 2024 | 4:20 PM
Shah Rukh Khan: స్టార్ హీరోల రేంజ్ లో షారుఖ్ మేనేజర్ జీతం! ఎంతో తెలుసా?

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఇటీవల వైజాగ్ వేదికగా కోల్ కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ చూడ్డానికి కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ కూడా వచ్చాడు. ఇందులో విశేషం ఏముంది అంటారా? విశేషం షారుఖ్ గురించి కాదు.. అతడి పక్కన మెరిసిన బ్యూటీ గురించి. ఈ మ్యాచ్ చూడ్డానికి షారుఖ్ తో పాటుగా ఓ లేడీ కూడా కేకేఆర్ టీమ్ కు సపోర్ట్ చేసింది. ఆమె ఎవరా అని ఆరా తీయగా.. కింగ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ అని తెలిసిందే. ఇక ఇప్పడు ఆమె జీతం గురించి నెట్టింట చర్చ మెుదలైంది. స్టార్ హీరోల రేంజ్ లో పూజ శాలరీ తీసుకుంటోందట. మరి ఇంతకీ ఆమె అందుకునే జీతం ఎంతో తెలుసా?

పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో తన టీమ్ అయిన కోల్ కత్తా ఆడుతున్న మ్యాచ్ లకు హాజరవుతూ.. జట్టును ఉత్తేజపరుస్తున్నాడు. ఇటీవల వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-కోల్ కత్తా మ్యాచ్ కూడా హాజరై టీమ్ ను ఉత్సాహపరిచాడు. ఇక ఈ మ్యాచ్ కు షారుఖ్ తో పాటుగా ఆమె మేనేజర్ పూజా దద్లానీ కూడా వచ్చింది. దీంతో అందరి చూపు ఆ బ్యూటీపైనే పడింది. ఆమె గురించి నెట్టింట్లో తెగ వెతకటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పూజ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి ఆమె జీతం. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఆమె షారుఖ్ నుంచి జీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె జీతం ఎంతో తెలుసా?

పూజా దద్లానీ ప్రతీ సంవత్సరం రూ. 7-9 కోట్ల రూపాయాలు జీతం కింద అందుకుంటున్నట్లు సమాచారం. అదీకాక ఆమెకు రూ. 45 కోట్లకు పైగా ఆస్తులున్నాయని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పూజ దద్లానీ కేవలం షారుఖ్ కు మేనేజర్ గానే కాకుండా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఉంటుంది. షారుఖ్ కు ఉన్న వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటుందట. ఆర్యన్ ఖాన్ జైలుకు వెళ్లినప్పుడు.. కొన్నికొన్ని సార్లు షారుఖ్ కు బదులుగా ఆమె కోర్టుకు కూడా వెళ్లింది. యాడ్ షూటింగ్స్ సంబంధించి డేట్స్ కూడా ఆమె చూసుకుంటుంది. ఇన్ని వ్యవహారాలు చూస్తుంది కాబట్టే షారుఖ్ ఆమెకు అన్ని కోట్ల జీతం ఇస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి స్టార్ హీరోల రేంజ్ లో జీతం తీసుకుంటున్న షారుఖ్ మేనేజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Dadlani Gurnani (@poojadadlani02)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss