iDreamPost
android-app
ios-app

Pushpa 2 Teaser: యూట్యూబ్ ను అల్లాడిస్తున్న బన్నీ.. పుష్ప 2 టీజర్.. సెన్సేషనల్ రికార్డు!

  • Published Apr 09, 2024 | 1:44 PM Updated Updated Apr 10, 2024 | 4:35 PM

రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేస్తోంది పుష్ఫ 2 టీజర్. అమ్మవారి అవతారంలో బన్నీ నట విశ్వరూపం చూపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేస్తోంది పుష్ఫ 2 టీజర్. అమ్మవారి అవతారంలో బన్నీ నట విశ్వరూపం చూపించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Pushpa 2 Teaser: యూట్యూబ్ ను అల్లాడిస్తున్న బన్నీ.. పుష్ప 2 టీజర్.. సెన్సేషనల్ రికార్డు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ఫ 2 టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ కు యునానిమస్ గా రెస్పాన్స్ వస్తోంది. నిమిషం ఎనిమి సెకన్ల నిడివి గల వీడియోతోనే గూస్ బంప్స్ తెప్పించాడు బన్నీ. అభిమానులు అస్సలు ఊహించని రేంజ్ లో అల్లు అర్జున్ ను చూపించాడు సుకుమార్. కేవలం గంగమ్మ తల్లి జాతర సీన్ వరకే కట్ చేసిన ఈ టీజర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఇక రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. తాజాగా సెన్సేషనల్ రికార్డు నెలకొల్పినట్లు మేకర్స్ ప్రకటించారు.

పుష్ఫ 2 టీజర్ రికార్డులను తిరగరాస్తూ.. దూసుకెళ్తోంది. నిన్న అల్లు అర్జున్ బర్త్ డే(ఏప్రిల్ 8) కానుకగా రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ లో రికార్డులను బద్దలుకొడుతోంది. విడుదలైన 101 నిమిషాల్లోనే 500K లైక్స్ ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ఫరాజ్.. తాజాగా మరో సెన్సేషనల్ రికార్డును సాధించింది. విడుదలైన 12 గంటల్లోనే 51 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటుగా 1 మిలియన్ లైక్స్ ను సాధించి.. సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ఇక యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది.

ఇక టీజర్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ బద్దలు కొడితే.. మూవీ రిలీజ్ అయితే థియేటర్లు తగలబడిపోవాల్సిందే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. టీజర్ తెచ్చిన హైప్ తో బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ ఖయమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పార్ట్ 1తోనే నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. పార్ట్ 1తో ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి. మరి రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్న పుష్ఫ 2 టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş