iDreamPost
android-app
ios-app

Shah Rukh Khan: అలాంటి పాత్ర అయితేనే హాలీవుడ్ కు వెళ్తా.. లేకపోతే లేదు: షారుఖ్ ఖాన్

  • Published Aug 15, 2024 | 12:35 PM Updated Updated Aug 15, 2024 | 12:35 PM

బాలీవుడ్ బాద్ షా హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడాడు. అలాంటి పాత్ర అయితేనే అక్కడి సినిమాల్లో నటిస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ బాద్ షా హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడాడు. అలాంటి పాత్ర అయితేనే అక్కడి సినిమాల్లో నటిస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 15, 2024 | 12:35 PMUpdated Aug 15, 2024 | 12:35 PM
Shah Rukh Khan: అలాంటి పాత్ర అయితేనే హాలీవుడ్ కు వెళ్తా.. లేకపోతే లేదు: షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్.. పేరుకు బాలీవుడ్ నటుడు అయినప్పటికీ.. తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. జవాన్, పఠాన్ మూవీలతో రికార్డ్ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టాడు కింగ్ ఖాన్. అయితే బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన షారుఖ్ ఇప్పటి వరకు హాలీవుడ్ మూవీలో నటించలేదు. ఇక ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. అలాంటి పాత్ర అయితేనే హాలీవుడ్ మూవీలో నటిస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ సినిమాల్లో నటించాలని చాలా మంది నటీ, నటుల కోరిక. కానీ ఆ అవకాశం అదరికీ రాదు. తక్కువ మంది హీరో, హీరోయిన్స్ కు మాత్రమే ఇలాంటి ఛాన్స్ లు వస్తుంటాయి. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో మకాం వేసింది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ‘ది గ్రే మ్యాన్’ అనే హాలీవుడ్ మూవీలో నటించాడు. త్వరలోనే అవెంజర్స్ సిరీస్ లో కి కూడా అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పటి వరకు హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

sharukh khan interesting

షారుఖ్ మాట్లాడుతూ..”హాలీవుడ్ మూవీలో నేను నటించాలంటే కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను అని అనుకుంటేనే అక్కడ సినిమాల్లో నటిస్తా. ఎందుకంటే? హాలీవుడ్ ప్రపంచంలోనే పెద్ద, గొప్ప సినిమా ఇండస్ట్రీ. అదీకాక ఇండియన్స్ నాకు ఇచ్చిన హోదాకు సరిపడ పాత్ర అయితేనే అక్కడి సినిమాల్లో నటిస్తాను. లేకపోతే లేదు. ఇక్కడి ప్రజలు నన్ను, నా కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తున్నారు. దానికి ఎలాంటి ఇబ్బంది కలగని పాత్రలు అయితేనే నేను హాలీవుడ్ మూవీస్ చేస్తాను” అని చెప్పుకొచ్చాడు కింగ్ ఖాన్. కాగా.. ప్రస్తుతం షారుఖ్ ‘కింగ్’ మూవీలో నటిస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందబోతోంది. మరి షారుఖ్ హాలీవుడ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş