చరణ్‌కి కాదు.. సౌత్ వారి ఫుడ్ కల్చర్‌కి అవమానం! ఇడ్లీ vs పానీ పూరీ!

SRK Insults South Food Culture: ప్రస్తుతం రామ్ చరణ్ మీద షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఇడ్లీ, వడ రామ్ చరణ్ అంటూ షారుక్ అవమానించాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే షారుక్ అవమానించింది చరణ్ ని మాత్రమే కాదని.. సౌత్ ఇండియన్స్ ఫుడ్ కల్చర్ ని కూడా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

SRK Insults South Food Culture: ప్రస్తుతం రామ్ చరణ్ మీద షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఇడ్లీ, వడ రామ్ చరణ్ అంటూ షారుక్ అవమానించాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే షారుక్ అవమానించింది చరణ్ ని మాత్రమే కాదని.. సౌత్ ఇండియన్స్ ఫుడ్ కల్చర్ ని కూడా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ హాజరైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో రామ్ చరణ్ ని స్టేజ్ మీదకి పిలిచే సమయంలో షారుక్ ఖాన్ ఇడ్లీ, వడ అంటూ అవమానకర కామెంట్స్ చేశారని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. చరణ్ ని షారుఖ్ ఖాన్ ఇన్సల్ట్ చేశాడని అంటున్నారు. ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ కూడా ఈ విషయాన్ని తప్పుబట్టారు. చరణ్ ని వేదిక మీదకి షారుక్ ఖాన్ ఆహ్వానించిన తీరు బాలేదని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్ ని అవమానించినట్టే ఉన్నాయని అన్నారు.

అయితే ఇప్పుడు తెరపైకి కొత్త వాదన ఒకటి వచ్చింది. షారుక్ ఖాన్ ఇన్సల్ట్ చేసింది రామ్ చరణ్ ని మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్స్ ఫుడ్ కల్చర్ ని కూడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సౌత్ ఇండియన్స్ కి ఇడ్లీ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇడ్లీ, వడ, సాంబార్ ఇవి డైలీ తినే ఆహారం. ఇంట్లో చేసుకున్నా, హోటల్ కి వెళ్లినా ఇడ్లీ, వడ తినాల్సిందే. అయితే ఇప్పుడు షారుక్ చేసిన కామెంట్స్ అటు తెలుగు హీరోనే కాకుండా.. ఇటు సౌత్ వారు తినే ఫుడ్ కల్చర్ ని అవమానించాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో మనోళ్లు షారుక్ ఖాన్ ని పానీ పూరీ హీరో అని పిలవచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ ఇడ్లీ అన్నది ప్రేమతో అని షారుక్ ఫ్యాన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

రామ్ చరణ్, షారుక్ ఖాన్ ల మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో మీకు తెలియదంటూ తెలుగు వారికి కొత్త కొత్త పాఠాలు నేర్పుతున్నారు. అలా అయితే మేము పానీ పూరీ షారుక్ అని పిలవచ్చా అని అంటున్నారు. ఇక్కడ ఎవరి ఆహార అలవాట్లు వారివి. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. మన సౌత్ కి వచ్చేసరికి ఇడ్లీ, వడ వంటివి తింటారు. నార్త్ కి వెళ్తే పానీ పూరీ, బేల్ పూరీ అని రకరకాల ఫుడ్స్ తింటారు. మొదటి నుంచీ కూడా కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు సెలెక్టెడ్ గా సౌత్ ని టార్గెట్ చేస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు అనే కాదు.. హిందీ వాళ్ళు కూడా మన సౌత్ వాళ్ళని ఎందుకో చులకనగా చూసేవారు. తెలుగు వాళ్ళకి హిందీ రాకపోతే ఏదో నేరం అన్నట్టు చూసేవారు. మన ఆహారపు అలవాట్లు అన్నా, మనమన్నా ఎందుకో చులకన భావం. ప్రస్తుతం ఈ వివక్ష ఎంత మేర ఉందో అనేది తెలియదు కానీ ఈ మధ్య తెలుగు సినిమాలు సత్తా చాటుతుండడంతో జనాలు మారారు.

అయితే హీరోలు మాత్రం మారలేదు. ఇంకా కొంతమంది స్టార్ హీరోలు తామే కింగులం.. పై నుంచి దిగి వచ్చామన్నట్టు ప్రవర్తిస్తున్నారు. సౌత్ ఫిల్మ్ హీరోలని టార్గెట్ చేయడమే కాకుండా ఇప్పుడు సౌత్ వారి ఫుడ్ కల్చర్ ని కూడా అవమానించే స్థాయికి దిగజారిపోయారన్న విమర్శలు అయితే వస్తున్నాయి. తెలుగు సినిమాలని తొక్కే ప్రయత్నం చేసినందుకే గతంలో బాలీవుడ్ స్టార్స్ సినిమాలని బ్యాన్ చేయమన్న హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అయ్యాయి. ఇడ్లీ, వడ కామెంట్స్ ఇలానే కొనసాగితే రేపు బ్యాన్ పానీపూరి హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ మీద షారుక్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ని ఇడ్లీ అంటూ సంబోధించడం అటు చరణ్ నే కాకుండా.. ఇటు దక్షిణాది వారి ఆహారపు అలవాట్లను అవమానించినట్టే అయ్యిందని అంటున్నారు. దీంతో ట్విట్టర్ లో ఇడ్లీ వర్సెస్ పానీపూరి వార్ నడుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments