iDreamPost
android-app
ios-app

‘బ్రో’ని పెళ్లాడిన బుల్లితెర నటి.. రెండేళ్లైనా అందుకే పిల్లలు లేరంటూ

  • Published Apr 15, 2024 | 11:45 PM Updated Updated Apr 15, 2024 | 11:45 PM

Lavanya And Shashi hegde: సాధారణంగా ఫీల్డ్ ఏదైనా తమతో కలిసి పని చేసే వారిని చూస్తూనే ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా సీరయల్ ఆర్టిస్ట్స్, సినిమా యాక్టర్స్ తోటి నటీనటులతో ప్రేమలో పడి వివాహం చేసుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం.

Lavanya And Shashi hegde: సాధారణంగా ఫీల్డ్ ఏదైనా తమతో కలిసి పని చేసే వారిని చూస్తూనే ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా సీరయల్ ఆర్టిస్ట్స్, సినిమా యాక్టర్స్ తోటి నటీనటులతో ప్రేమలో పడి వివాహం చేసుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం.

  • Published Apr 15, 2024 | 11:45 PMUpdated Apr 15, 2024 | 11:45 PM
‘బ్రో’ని పెళ్లాడిన బుల్లితెర నటి.. రెండేళ్లైనా అందుకే పిల్లలు లేరంటూ

సాధారణంగా పెళ్లైన వధూవరులకు కుటుంబ సభ్యులు, చుట్టాలు, మిత్రులు ఇలా ఒకరేంటి అందరి దగ్గరి నుంచి ఒక కామన్ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఏమైనా విశేషం ఉందా? పెళ్లైన వారికి ఈ ప్రశ్న ప్రాముఖ్యం, ప్రశ్న వల్లే చిరాకు బాగా తెలిసే ఉంటుంది. అయితే ఇది సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఎదురవుతూనే ఉంటుంది. కిడ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటూ పాషుగా అడుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకునే సెలబ్రిటీ కపుల్ కి కూడా ఈ ప్రశ్నే ఎదురైంది. పెళ్లై రెండేళ్లు అయ్యింది కదా.. ఇంకా పిల్లలను ప్లాన్ చేయడం లేదా అని అడుగడం స్టార్ట్ చేశారు. కానీ, ఈ కపుల్ మాత్రం అందుకు సింపుల్ సమాధానం చెప్పారు. పిల్లలను కనాలి అంటే ఒక కండిషన్ ఉందంట.

చాలామంది దృష్టిలో సామాన్యులైనా, సెలబ్రిటీలు అయినా పెళ్లైన తర్వాత వెంటనే పిల్లలను కనేయాలి. లావణ్య- శశి హెగ్డేలకు కన్నడలో సీరియల్ యాక్టర్స్ గా మంచి గుర్తింపు ఉంది. సోషల్ మీడియాలో కూడా వీళ్లు యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈ సెలబ్రిటీ కపుల్ కి వివాహం జరిగి రెండేళ్లు అయ్యింది. కానీ, ఇంకా వీళ్లకు పిల్లలు పుట్టలేదు. ఈ విషయం గురించే అయినవాళ్లు, కాని వాళ్లు అందరూ వీళ్లని ఇదే విషయంపై ప్రశ్నిస్తున్నారంట. ఈ ప్రశ్న వినీ వినీ విసిగిపోయారో.. మరెవరూ తమని ఇలాంటి ప్రశ్న అడగకూడదని ఫిక్స్ అయ్యారో గానీ.. వారి మధ్య ఉన్న కండిషన్ విషయాన్ని వెల్లడించారు. ఒక షరతు వల్లే తాము పిల్లల్ని కనడం లేదు అంటూ కుండ బద్దలు కొట్టేశారు.

లావణ్య- శశి హెగ్డేలు కావాలని పిల్లల విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాము హనీమూన్ కి వెళ్లి వచ్చిన తర్వాతే పిల్లలను ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారంట. ఈ మేరకు శశి హెగ్డే ఒక షరతు పెట్టుకున్నట్లు లావణ్య చెప్పుకొచ్చింది. మానాలీ గానీ.. విదేశాలకు గానీ హానీమూన్ కి వెళ్లి వచ్చిన తర్వాతే పిల్లల విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. రెండుసార్లు హనీమూన్ ప్లాన్ చేయగా.. ఇంక వెళ్లడమే ఆలస్యం అనుకున్న సమయంలో బంధువులు చనిపోవడంతో హనీమూన్ ట్రిప్ వాయిదా పడింది.

ఆ నేపథ్యంలోనే హనీమూన్ కి వెళ్లి వచ్చిన తర్వాతే పిల్లలను కనాలి అని తన భర్త షరతు పెట్టారని వివరించింది. అలాగే తాను కూడా ఒక షరతు పెట్టిందంట. హనీమూన్ కి మనాలీకో.. విదేశాలకో వెళ్లి వచ్చిన తర్వాత పిల్లలను కనాలంట. వచ్చే జూన్ లో హనీమూన్ కి వెళ్తున్నట్లు తెలియజేసింది. ఇంక వీళ్లిద్దరికి ‘రాజా రాణి సీరియల్’ సెట్స్ లో వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పట్లో లావణ్య.. శశి హెగ్డేని బ్రో అని పిలేచదంట. బ్రో అని పిలిచిన శశీనే ఆమెకు భర్త కావడం విశేషం. ప్రస్తుతం వీళ్ల హనీమూన్ కండిషన్ నెట్టింట వైరల్ అవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş