iDreamPost
android-app
ios-app

రెండుసార్లు అబార్షన్.. 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బుల్లితెర నటి!

  • Published Apr 27, 2024 | 10:14 PM Updated Updated Apr 27, 2024 | 10:14 PM

Serial Actress Julie Announced Her Pregnency: బుుల్లితెర నటి తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. పెళ్లైన పదేళ్ తర్వాత తాను తల్లి కాబోతున్న విషయాన్ని అందరితో పంచుకుంది.

Serial Actress Julie Announced Her Pregnency: బుుల్లితెర నటి తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. పెళ్లైన పదేళ్ తర్వాత తాను తల్లి కాబోతున్న విషయాన్ని అందరితో పంచుకుంది.

  • Published Apr 27, 2024 | 10:14 PMUpdated Apr 27, 2024 | 10:14 PM
రెండుసార్లు అబార్షన్.. 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బుల్లితెర నటి!

తల్లి కావాలని ప్రతి స్త్రీకి ఉంటుంది. అమ్మా అని పిలుపించుకోవాలి ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ, కొందరికి ఆ అదృష్టంగా త్వరగా దక్కితే.. మరికొందరికి మాత్రం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ, అలాంటి ఒక తీపి కబురు అందినప్పుడు మాత్రం వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు అలాంటి ఒక ఫేజ్ లోనే ఒక బుల్లితెర నటి ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ జరిగింది. పెళ్లైన పదేళ్ల తర్వాత అది కూడా 42 ఏళ్ల వయసులో తల్లికాబోతోంది. 5వ నెలలో చేసుకున్న సీమంతం వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సీమంతం విషయం వైరల్ గా మారింది.

ఆ బుల్లితెర నటి మరెవరో కాదు.. తమిళ సీరియల్ నటి జూలీ. తాను 42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. పెళ్లైన పదేళ్ల తర్వాత తమ ఇంట్లోకి ఒక బుజ్జాయి రాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం తాను 5 నెలల గర్భిణి. ఇటీవలే ఆమెకు 5వ నెలలో నిర్వహించే సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోను తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేసుకుంది. 5వ నెలలో జరగాల్సిన వేడుక ఆనందంగా జరిగింది అంటూ వెల్లడించింది. ఎవరి దిష్టి తగలకూడదు అన్నట్లు ఒక ఏమోజీ కూడా పెట్టింది.

పదేళ్ల క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ మణికందన్ ను జూలీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి వైవాహిక జీవితం గురించి జూలీ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. తమకు పదేళ్ల క్రితం పెళ్లైందని అయితే పెళ్లవగానే తాము పిల్లలు కావాలి అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే మొదటిసారి వచ్చిన గర్భం మిస్ క్యారీ అయ్యినట్లు వెల్లడించింది. రెండోసారి కూడా అలాగే అబార్షన్ అయిపోయినట్లు చెప్పింది. రెండుసార్లు అలా జరగడంతో పిల్లల కోసం చికిత్స తీసుకున్నామని చెప్పారు. తన భర్త మణికందన్ కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. జూలీ ఎప్పుడు బయటకు వెళ్లినా పిల్లలున్నారా? మీకు పాపా? బాబా? అంటూ ప్రశ్నలతో చంపేస్తున్నారు.

పిల్లల గురించి ప్రశ్నలు వస్తాయనే తను చాలా వరకు ఈవెంట్స్ కి కూడా వెళ్లడం మానేసింది అంటూ తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు పేరెంట్స్ గా ప్రమోషన్ రావడం ఎంతో ఆనందంగా ఉందని మణికందన్ వెల్లడించాడు. అలాగే ఎంతో మంది పెద్ద హీరోల సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన మణికందన్.. త్వరలోనే డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మణికందన్- జూలీ దంపతులకు నెట్టింట ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ వార్త జూలీ దంపతులకే కాదు.. వారికి కూడా గుడ్ న్యూస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Visalakshi Manikandan (@visalakshimanikandan)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss