iDreamPost
android-app
ios-app

షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ రెడీ

  • Published Feb 20, 2024 | 8:20 PM Updated Updated Feb 20, 2024 | 8:20 PM

Shah Rukh Khan Pathaan Sequel: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. గత ఏడాది డంకీ మూవీ మాత్రం తీవ్ర నిరాశ పరిచింది.

Shah Rukh Khan Pathaan Sequel: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. గత ఏడాది డంకీ మూవీ మాత్రం తీవ్ర నిరాశ పరిచింది.

  • Published Feb 20, 2024 | 8:20 PMUpdated Feb 20, 2024 | 8:20 PM
షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ రెడీ

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవల రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన డంకీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కాగా ఈమధ్యనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయింది. అయితే ఇప్పుడు ఈ సూపర్ స్టార్ తదుపరి సినిమా పై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఆయన నటించిన భారీ బ్లాక్ బస్టర్ పఠాన్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

జనవరి 2023లో విడుదలైన పఠాన్ భారీ విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టి షారుఖ్ ఖాన్ కు కమ్ బ్యాక్ హిట్ గా నిలిచింది. దాదాపు పదేళ్ల తరువాత ఆయన షారుఖ్ ఇచ్చిన హిట్ సినిమా పఠాన్. YRF స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన పఠాన్ లో షారుఖ్ ఖాన్ రా ఏజెంట్‌ గా కనిపించారు. తమను ఎంతగానో అలరించిన పఠాన్ పాత్ర మరో సారి తెరపైకి రానుందనే వార్త విని షారుఖ్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. పఠాన్ సాధించిన భారీ విజయం వల్ల చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా ఆ సినిమాకి సీక్వెల్ తీస్తే బాగుంటుందని అనుకున్నారట. YRF స్పై యూనివర్స్‌లో పఠాన్:2 8వ చిత్రం అవుతుంది. ఈ సినిమా ఆ తరువాత రాబోయే పఠాన్ వర్సెస్ టైగర్ సినిమా కథకు ఒక ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ఈ వార్త వచ్చినప్పటి నుండి, అభిమానులు షారూఖ్ ఖాన్‌ను తిరిగి పఠాన్‌గా చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ అభిమానులు కూడా  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పఠాన్ 2 డిసెంబర్ 2024లో సెట్స్ పైకి వెళ్లనుందట. షారుఖ్ ఖాన్ తో పాటు దీపికా పదుకునే, జాన్ అబ్రహం ప్రథాన పాత్రల్లో నటించగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. మరి సీక్వెల్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే ఖచ్చితంగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş