SNP
Chandra Mohan Died: ప్రముఖ సీనియర్ తెలుగు సినిమా నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
Chandra Mohan Died: ప్రముఖ సీనియర్ తెలుగు సినిమా నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
SNP
తెలుగు సినిమా చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం మృతిచెందారు. చంద్రమోహన్ 1943 మే 23న కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు. ఆయన పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన భార్య జలంధర, వీరికి ఇద్దరు కుమార్తెలు. తెలుగు సినిమా రంగంలో చంద్రమోహన్ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. కథానాయకుడిగా 175పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించారు. 1966లో రంగులరాట్నం చిత్రంతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి సహనాయకుడిగా, కథనాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు.
ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. చిత్రపరిశ్రమలో కొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. చంద్రమోహన్ వ్యవసాయ కళాశాల, బాపట్లలో బీఎస్‌సీ పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశాడు. సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి సినిమా ప్రయత్నాలు చేశారు. అయితే.. గతకొంత కాలంగా చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారు.