iDreamPost
android-app
ios-app

Nani: నాని-వివేక్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ! జోనర్ కూడా చెప్పేసిన న్యాచురల్ స్టార్..

  • Published Sep 06, 2024 | 3:45 PM Updated Updated Sep 06, 2024 | 3:45 PM

Nani director Vivek Athreya combo hattrick movie coming: న్యాచురల్ స్టార్ నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. ఈ విషయాన్ని నానినే స్వయంగా చెప్పాడు. సరిపోదా శనివారం విజయ వేడుకలో ఈ కామెంట్స్ చేశాడు.

Nani director Vivek Athreya combo hattrick movie coming: న్యాచురల్ స్టార్ నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. ఈ విషయాన్ని నానినే స్వయంగా చెప్పాడు. సరిపోదా శనివారం విజయ వేడుకలో ఈ కామెంట్స్ చేశాడు.

  • Published Sep 06, 2024 | 3:45 PMUpdated Sep 06, 2024 | 3:45 PM
Nani: నాని-వివేక్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ! జోనర్ కూడా చెప్పేసిన న్యాచురల్ స్టార్..

టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన జోనర్ నుంచి బయటకి వచ్చి తీసిన మూవీ ‘సరిపోదా శనివారం’. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ చిత్రం టైటిల్ తోనే క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వివేక్ టేకింగ్, నాని, ఎస్ జే సూర్యల ట్రెమెండిస్ యాక్టింగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది. మూవీ సూపర్ సక్సెస్ కావడంతో.. విజయ వేడుకను తాజాగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో వివేక్ తో ఇంకో మూవీ చేయబోతున్నాను, అంటూ దాని జోనర్ కూడా చెప్పేశాడు నాని.

నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. ఇప్పటికే వివేక్ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’, ‘సరిపోదా శనివారం’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అంటే సుందరానికి డీసెంట్ టాక్ తెచ్చుకోగా.. లేటెస్ట్ గా వచ్చిన సరిపోదా శనివారం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.  తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో థియేటర్ల దగ్గర రచ్చ చేస్తోంది. ఇక ఈ మూవీలో నాని, ఎస్ జే సూర్య యాక్టింగ్ కు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా దయానంద్ పాత్రలో ఎస్ జే సూర్యను తప్పితే మరో నటుడిని ఊహించుకోలేనంతగా అందులో జీవించేశాడు. మూవీ మంచి విజయం సాధించడంతో.. మేకర్స్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో నాని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సరిపోదా శనివారం సక్సెస్ మీట్ లో నాని చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. నాని మాట్లాడుతూ..”సరిపోదా శనివారం మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అంతే కాకుండా.. నేను వివేక్ ఆత్రేయతో కలిసి ఇంకో సినిమా చేయబోతున్నాను. అది ఫుల్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు. దాంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వివేక్ కు మంచి కామెడీ రైటింగ్ ఉంది.. నానిలో కామెడీ టైమింగ్ ఉంది. వివేక్ రైటింగ్ కు నాని టైమింగ్ తోడైతే.. థియేటర్లు నవ్వులతో దద్దరిల్లుతాయని అభిమానులు కోరుకుంటున్నారు. నాని కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేశాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఇతడు ‘హిట్ 3’లో నటిస్తున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2025 మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీతో పాటుగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో కూడా నాని ఓ చిత్రం చేస్తున్నాడు. మరి ముచ్చటగా మూడోసారి వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet