iDreamPost
android-app
ios-app

ధనుష్- శేఖర్ కమ్ముల టైటిల్ రిలీజ్.. ‘గోదావరి’ తర్వాత మళ్లీ ఇలా..

  • Published Mar 08, 2024 | 7:13 PM Updated Updated Mar 08, 2024 | 7:13 PM

Sekhar Kammula- Dhanush Movie Title: శేఖర్ కమ్ముల- ధనుష్ కాంబోకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఈ అప్ డేట్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Sekhar Kammula- Dhanush Movie Title: శేఖర్ కమ్ముల- ధనుష్ కాంబోకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఈ అప్ డేట్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

  • Published Mar 08, 2024 | 7:13 PMUpdated Mar 08, 2024 | 7:13 PM
ధనుష్- శేఖర్ కమ్ముల టైటిల్ రిలీజ్.. ‘గోదావరి’ తర్వాత మళ్లీ ఇలా..

కోలీవుడ్ లో స్టార్ హీరో ధనుష్, తెలుగులో ఫేమస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జత కడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు మహాశివరాత్రి సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అలాగే టైటిల్ ని కూడా రివీల్ చేశారు. ఈ టైటిల్- పోస్టర్ లో కథ కూడా చెప్పేశారు. ఇప్పుడు ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. అసలు ఈ టైటిల్ ఏంటి? ఆ కథ ఏంటో చూద్దాం.

కోలీవుడ్ వెర్సటైల్ హీరోగా యాక్టర్ ధనుష్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “కెప్టెన్ మిల్లర్”. ఈ సినిమాతో ధనుష్ తన కెరీర్ లో మరో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ధనుష్ వరుస ప్రాజెక్ట్స్ ను లైన్ అప్ చేసుకున్నాడు. కేవలం తమిళ్ లోనే కాకుండా.. తెలుగు దర్శకులతో కూడా ధనుష్ సాలిడ్ లైన్ అప్స్ ను సెట్ చేసుకున్నాడు. వీటిలో ప్రస్తుతం అందరు మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న కాంబినేషన్ ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్. ఇప్పటికే ఈ సినిమాను #DNS అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేశారు.

ధనుష్- శేఖర్ కమ్ముల మూవీకి టైటిల్ ‘కుబేర’ అని ఫిక్స్ చేశారు. ఇంక ధనుష్ గెటప్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో ధనుష్ యాచకుడి తరహాలో కనిపిస్తున్నాడు. మాసిపోయిన దుస్తులు, బాగా పెరిగిపోయిన గడ్డం, చింపిరిగా ఉన్న జుట్టుతో చూపిస్తున్నారు. ఇంక ధనుష్ వెనకాల పరమశివుడు భిక్షాటన చేస్తున్న పిక్ ఉంది. అంటే ఈ మూవీలో ధనుష్ పాత్ర భిక్షగాడిగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే ఇటీవల తిరుపతిలో ధనుష్ బెగ్గర్ గెటప్ లో చూపిస్తూ షూటింగ్ చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ తో అది కన్ఫమ్ అయిపోయింది.

అలాగే సినిమా టైటిల్ చూస్తే కుబేర అని పెట్టారు. అంటే గెటప్ కి టైటిల్ కి పొంతన లేదు. అయితే ఒక భిక్షగాడు కుబేరుడు కావాలి. లేదా ఒక కుబేరుడు భిక్షగాడిగా అయినా మారి ఉండాలి. ఈ తరహాలోనే కథ ఉండే ఆస్కారం ఉంది. ఇందులో నాగార్జున పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అలాగే ఇందులో రష్మిక మందన్నా నటించబోతోంది అంటూ ఎప్పటి నుంచో బజ్ ఉంది. అది ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది. ఇంక ఈ సినిమాకు నిర్మాతలుగా పుష్కర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ లు వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే, ఫీల్ గుడ్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ శేఖర్ కమ్ముల. అలానే ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి నటించే హీరో ధనుష్. మరి వీరి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ కుబేర చిత్రం ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి, “కుబేర” టైటిల్, ధనుష్ ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss