iDreamPost
android-app
ios-app

‘కుబేరా’.. కొత్త టాలెంట్ తో ఎక్సైటింగ్ గా ఉంది!

సెన్సిటివ్ కథలను అద్భుతంగా తెరకెక్కిస్తాడన్న శేఖర్ కమ్ముల నుంచి ఎవ్వరూ ఊహించని సినిమా రాబోతోంది. ధనుష్ హీరోగా కుబేరా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

సెన్సిటివ్ కథలను అద్భుతంగా తెరకెక్కిస్తాడన్న శేఖర్ కమ్ముల నుంచి ఎవ్వరూ ఊహించని సినిమా రాబోతోంది. ధనుష్ హీరోగా కుబేరా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

‘కుబేరా’.. కొత్త టాలెంట్ తో ఎక్సైటింగ్ గా ఉంది!

నిన్న విడుదలైన కుబేరా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. కొత్తగా ఉంది. ఎంత కొత్తగా ఉందంటే కింగ్ నాగార్జునను కూడా రివీల్ చెయ్యలేదు. జస్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ కాగానే ధనుష్ రివీల్ అవుతాడు. కొన్ని సెకండ్స్ తర్వాత. బేక్ ప్రొజెక్షన్లో ధనుష్ చింపిరి గెడ్డంతో ఫకీర్లా ఉన్నాడు. శివపార్వతుల పెద్ద ఫొటో ముందు ధనుష్ వెనక్కి తిరిగి ఉంటాడు, కాసేపటికి గానీ కెమెరా ఫేవర్లోకి రాడు.

శేఖర్ కమ్ముల కథ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కమర్షియల్ పడిగట్టు పద్ధతులను పెద్దగా పట్టించుకోడు. తాను అనుకున్నది సింపుల్ గా తీసి ఒప్పించే పనిలో మాత్రమే ఉంటాడు. అలా హిట్ అయిందా ఒకే….లేదా డబుల్ ఓకే. అయితే శేఖర్ నమ్మిన విధానాలు శేఖర్ కి మంచి గుర్తింపును తీసుకురావడమే కాదు, ఓ డిఫరెంట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చాయి. ఆ సినిమాలకు ప్రత్యేకమైన ఆడియన్స్ తయ్యారయ్యారు. ఎప్పుడూ సినిమాలు చూడడానికి మక్కువ చూపించని ఛాందస ప్రేక్షకులు కూడా శేఖర్ కమ్ముల సినిమా వస్తున్నాదంటే థియేటర్ వైపుకి పరిగెత్తడానికి మొగ్గు చూపుతారు. అదీ శేఖర్ కమ్ముల స్టయిల్. అదే స్టయిల్లోనే ఉంది కుబేరా ఫస్ట్ లుక్.

తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ దక్షిణాది భాషలతో పాటు, హిందీలో కూడా రిలీజుకి నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు ప్లాన్ చేస్తున్న కుబేరా ఫస్ట్ లుక్ లో శివ సినిమాతో బోలెడు పాప్యులారిటీ తెచ్చుకున్న నాగార్జునని చూపించడానికి శేఖర్ అర్రులు చాచలేదు. కేవలం ధనుష్ వరకే ప్లాన్ చేశాడు. అంటే ధనుష్ మెయిన్ క్యారెక్టర్ అని అర్ధమైపోతోంది. నాగార్జునది సపోర్టింగ్ క్యారెక్టర్ అని అంటున్నారు. ఏడాదికోసారి వచ్చే మహా పర్వదినం, హిందువులంతా ఎంతో భక్తితో కొలుచుకునే మహా శివరాత్రి నాడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం, అందులో శివపార్వతుల మీదనే ఎక్కువ సేపు కెమెరా పాన్ చేయడం క్లియర్ గా కనిపిస్తోంది. ఇక్కడే మార్కులు కొట్టేశాడు శేఖర్.

శివరాత్రినాడు శివపార్వతుల కటౌట్ కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన కుబేరా ఫస్ట్ లుక్ దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలో కూడా ఓ ఊపు ఊపేసింది. కేవలం గంటల్లో లక్షల వ్యూస్ అండ్ లైక్స్, వరదల్లా కామెంట్లు వచ్చి పడ్డాయి. నాగార్జున మాత్రం తన ఎక్స్ హేండిల్ ద్వారా తన అంతులేని ఆనందాన్ని మూడు ముక్కల్లో చెప్పేశారు. యంగ్ అండ్ న్యూ టాలెంట్ తో చాలా ఎక్సైటింగ్ గా ఉందని పోస్ట్ చేసి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేయడం అందరిని ఆకట్టుకుంది. ధనుష్ చేస్తున్న 51వ సినిమాగా అత్యంత ఎక్కువ బడ్జెట్ తో కుబేరా తయారవుతుండడం విశేషం.

ఇదికూడా చదవండి: టాలీవుడ్ డైరెక్టర్స్ కొత్త ట్రెండ్. యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి