ajaykrishna
ajaykrishna
లవ్ చేసిన వాడితో లైఫ్ లాంగ్ ఉండాలని.. తన నలుగురు పిల్లలతో సహా పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన సీమా హైదర్ గురించి అందరికి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనాతో తరచూ పబ్ జి గేమ్ ఆడిన సీమా.. అతనితో పరిచయం పెంచుకొని ప్రేమలో పడింది. కట్ చేస్తే.. పెళ్ళై నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ.. వాళ్లను తీసుకొని ప్రేమించిన సచిన్ దగ్గరికి వచ్చేసింది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ ని ఇటీవల అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ బెయిల్ పై బయటికి వచ్చారు. అయితే.. ఇప్పుడీ సీమా హైదర్ కి ఏకంగా సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. జానీ ఫైర్ ఫాక్స్అనే ప్రొడక్షన్ హౌస్ వారు మంగళవారం సీమాని గ్రేటర్ నోయిడాలో కలిశారు. రాజస్థాన్ ఉదయపూర్ లో ఇస్లామిక్ రేడికల్స్ చేతిలో హత్య చేయబడిన టైలర్ కన్హయ్య లాల్ లైఫ్ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ టైలర్ మర్డర్ స్టోరీ’ అనే పేరుతో.. ఈ సినిమాని జానీ ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. కాగా.. మూవీ డైరెక్టర్స్ జయంత్ సిన్హా, భరత్ సింగ్ సీమాని ఆడిషన్ చేశారు. ఆ తర్వాత రా ఏజెంట్ పాత్ర కోసం సీమాని ఎంపిక చేసినట్లు తెలిపారు. అయితే.. ఈ సినిమాలో నటించడానికి సీమా.. ఓ కండిషన్ కూడా పెట్టిందని సమాచారం. అదేంటంటే.. యూపి లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) నుండి క్లీన్ చిట్ పొందిన తర్వాతే సినిమాలో నటిస్తానని చెప్పినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. ఉదయపూర్ లో గతేడాది జూన్ 28న ఇద్దరు వ్యక్తులు టైలర్ కన్హయ్య లాల్(46 )ని హత్య చేశారు. రద్దీగా ఉన్నటువంటి ధన్ మండి మార్కెట్ లో తన దుకాణం వద్ద ఉన్న కన్హయ్యని.. కస్టమర్స్ గా వచ్చిన ఇద్దరు నిందితులు మహమ్మద్ రియాజ్ అన్సారీ, మహమ్మద్ ఘోష్ హత్య చేసి పారిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజస్థాన్ ఉలిక్కిపడింది. మరి సీమాకి డైరెక్టర్స్ ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? అనంటే.. గ్రేటర్ నోయిడాలో కొత్త ఇంటికి మారాక.. సచిన్, సీమా కష్టాలు మామూలుగా లేవట. ఇద్దరు తమ ఇబ్బందులను వీడియో తీసి పెట్టారు. దీంతో తినడానికి తిండి లేని పరిస్థితిని వీడియోలో గుర్తించిన డైరెక్టర్స్.. తనకు అవకాశం ఇచ్చారని సీమా దంపతులు చెబుతున్నారట. మరి సీమా సినిమా ఎంట్రీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.