iDreamPost
android-app
ios-app

పరిశ్రమకు సమస్యల వలయం – షూటింగులు బందా ?

  • Published Jul 18, 2022 | 12:20 PM Updated Updated Dec 18, 2023 | 6:06 PM

గత కొన్ని నెలలుగా థియేటర్లకు జనాలు సరిగా రాక వసూళ్లు తీవ్రంగా ప్రభావితం చెందాయి. దీంతో కలవరపడిన ప్రొడ్యూసర్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాతే మళ్ళీ షూట్లు మొదలుపెట్టాలని చూస్తున్నారట.

గత కొన్ని నెలలుగా థియేటర్లకు జనాలు సరిగా రాక వసూళ్లు తీవ్రంగా ప్రభావితం చెందాయి. దీంతో కలవరపడిన ప్రొడ్యూసర్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాతే మళ్ళీ షూట్లు మొదలుపెట్టాలని చూస్తున్నారట.

పరిశ్రమకు సమస్యల వలయం – షూటింగులు బందా ?

ఆగస్ట్ 1 నుంచి టాలీవుడ్ షూటింగులు ఆపేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వచ్చిన వార్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది. గత కొన్ని నెలలుగా థియేటర్లకు జనాలు సరిగా రాక వసూళ్లు తీవ్రంగా ప్రభావితం చెందాయి. దీంతో కలవరపడిన ప్రొడ్యూసర్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాతే మళ్ళీ షూట్లు మొదలుపెట్టాలని చూస్తున్నారట. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ చర్చలు మాత్రం సీరియస్ గా జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో పలు ప్రతిపాదనలు, అభ్యంతరాలు, అడ్డంకులు తదితరాలన్నీ డిస్కస్ చేస్తున్నట్టు తెలిసింది. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు సైతం కనీసం బ్రేక్ ఈవెన్ చేరుకోలేకపోవడం పట్లే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.
A chain of problems for the industry
మరీ ముఖ్యంగా ఓటిటి వ్యవహారాలకు సంబంధించి దృష్టి పెడుతున్నట్టు వినికిడి. ఎలాగైనా సరే థియేటర్ కు ఓటిటికి మధ్య పది వారాల గ్యాప్ ఉండేలా అందరినీ ఒప్పించడమే అజెండాగా పెట్టుకున్నారట. అయితే ఇదంత సులభం కాదు. రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అంటే అన్ని సినిమాలకు ఇది ఒకే ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే ఓటిటి సంస్థలు తాము ఆఫర్ చేసే మొత్తం భారీగా తగ్గించేస్తాయి. ఉదాహరణకు ఆ మధ్య ఆచార్యను ఇరవై ఒక్క రోజులకే డీల్ చేసుకున్నప్పుడు ప్రైమ్ సుమారుగా 18 కోట్ల దాకా అదనపు మొత్తాన్ని ఇచ్చిందని ప్రచారం జరిగింది. ఒకవేళ డెబ్భై రోజుల తర్వాతంటే కనీసం అయిదు కోట్లయినా ఇస్తుందంటే డౌటే.


బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినవాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటొచ్చి యావరేజ్ లేదా ఫ్లాపులకు చిక్కులు వస్తాయి. ఇక టికెట్ రేట్లకు సంబంధించి కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక అండర్ స్టాండింగ్ కి రావాలి. కొత్త సినిమా రావడం ఆలస్యం బడ్జెట్ తో సంబంధం నైజామ్ మల్టీ ప్లెక్సుల్లో 295 లేదా 250 రూపాయలు పెట్టేస్తున్నారు. దీని వల్ల మధ్య తరగతి థియేటర్లకు దూరమవుతోంది. ఇది గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. ఏడాది క్రితం 150 ఉన్న ధర ఒకేసారి రెట్టింపు కావడం ఆడియన్స్ అంగీకరించడం లేదు. మరి షూటింగులు బందు చేసి ఇవన్నీ ఒక కొలిక్కి తెస్తారా లేక ఆ అవసరం లేకుండా పరిష్కారం చూపిస్తారా అనేది వేచి చూడాలి. సినిమా సినిమాకు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్న స్టార్ హీరోల కోట్ల రెమ్యునరేషన్ గురించి కొన్ని రికమండేషన్లు కూడా చేయబోతున్నారట.