iDreamPost
iDreamPost
ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ వ్యవధిలో సర్కారు వారి పాట థియేటర్లలో అడుగు పెట్టనుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. తెల్లవారుఝామున బెనిఫిట్ షోల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఆట హైదరాబాద్ కూకట్పల్లి మూసాపేట్ ప్రాంతాల్లో పడనుంది. ఏపిలోనూ నాలుగు నుంచి అయిదు మధ్యలో షోలు మొదలవుతాయి. అడ్వాన్స్ బుకింగ్స్ స్వింగ్ మీదున్నాయి. మరీ ఆర్ఆర్ఆర్ తో పోల్చలేం కానీ ఆచార్య వల్ల దెబ్బ తిన్న డిస్ట్రిబ్యూటర్లకు సర్కారు అమ్మకాలు మంచి హుషారు ఇస్తున్నాయి. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం లాంగ్ వీకెండ్ మొత్తం ప్రిన్స్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది.
క్రేజ్ ఎంత ఉన్నా బిజినెస్ మాత్రం రీజనబుల్ గా చేశారు నిర్మాతలు. ప్యాన్ ఇండియా రిలీజ్ కాకపోవడంతో 125 కోట్ల లోపే థియేట్రికల్ రైట్స్ ని అమ్మేశారు. సో లాభాలు కళ్లజూడాలంటే నూటా పాతిక కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఈ మార్కు అందుకోవడం చాలా సులభం. పైగా వారం రోజుల పాటు పెరిగిన రేట్లతో టికెట్లు అమ్ముకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఇదింకా సులభం. కాకపోతే ఈ ధరలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఏ మేరకు టర్న్ అవుతారన్నది చూడాలి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 బడ్జెట్ పరిధులు వేరు కాబట్టి నడిచాయి కానీ రెగ్యులర్ ఎంటర్ టైనర్స్ కు ఇదంత సులభం కాదు. ఏరియాల వారీగా ఇలా ఉంది
నైజామ్ – 36 కోట్లు
సీడెడ్ – 14 కోట్లు
ఉత్తరాంధ్ర – 13 కోట్లు
గుంటూరు – 8 కోట్ల 50 లక్షలు
ఈస్ట్ గోదావరి – 9 కోట్లు
వెస్ట్ గోదావరి – 8 కోట్లు
కృష్ణా – 7 కోట్ల 50 లక్షలు
నెల్లూరు – 4 కోట్లు
ఏపి/తెలంగాణ టోటల్ బిజినెస్ – 100 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 11 కోట్ల 50 లక్షలు
ఓవర్సీస్ – 11 కోట్ల 50 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా జరిగిన బిజినెస్ – 123 కోట్లు
గురువారం రిలీజ్ కాబట్టి నాలుగు రోజుల వారాంతపు రన్ దొరుకుతుంది. పోటీలో ఇంకే సినిమాలు లేవు. శివ కార్తికేయన్ డబ్బింగ్ మూవీ కాలేజీ డాన్ ఉంది కానీ దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. తమిళనాడులో దాని ప్రభావం ఉంటుంది. దర్శకుడు పరశురామ్ హీరోయిన్ కీర్తి సురేష్ లతో పాటు మహేష్ బాబు విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఓపెనింగ్స్ ఎలాగూ సాలిడ్ గా ఉంటాయి కానీ టాక్ ఎలా రాబోతోందన్నది కీలకం కాబోతోంది. ఆచార్య వాష్ అవుట్ అయిపోవడంతో ఎక్కువ థియేటర్లు దొరుకుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇంకో మూడు రోజుల్లో 50 రోజులు పూర్తి చేసుకున్నాక మరిన్ని స్క్రీన్లు సర్కారు వారి పాటకు కేటాయించబోతున్నారు