Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ! ఊరమాస్ కు మించి నాని యాక్టింగ్..

Saripodhaa Sanivaaram Twitter Review: దసరా మూవీలో మాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు నాని. అభిమానులు ఆ యాక్టింగ్ ను మర్చిపోకముందే మరోసారి మాస్ ఎంటర్ టైనర్ తో సరిపోదా శనివారం అంటూ థియేటర్లలోకి దిగిపోయాడు. ఈ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

Saripodhaa Sanivaaram Twitter Review: దసరా మూవీలో మాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు నాని. అభిమానులు ఆ యాక్టింగ్ ను మర్చిపోకముందే మరోసారి మాస్ ఎంటర్ టైనర్ తో సరిపోదా శనివారం అంటూ థియేటర్లలోకి దిగిపోయాడు. ఈ మూవీ ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

న్యాచురల్ స్టార్ నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ‘సరిపోదా శనివారం’. వీరిద్దరి కాంబోలో గతంలో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. ఆ మూవీ కంప్లీట్ గా
డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. కానీ ఈ మూవీ దానికి పూర్తి ఆపోజిట్ అని ట్రైలర్ చూస్తేనే అర్ధమైంది. వివేక్ ఆత్రేయ తన జానర్ నుంచి బయటకి వచ్చి తీసిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇక ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు మూవీ ఎలా ఉందో తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మరి సరిపోదా శనివారం ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

దసరా మూవీలో మాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు నాని. అభిమానులు ఆ యాక్టింగ్ ను మర్చిపోకముందే మరోసారి మాస్ ఎంటర్ టైనర్ తో సరిపోదా శనివారం అంటూ థియేటర్లలోకి దిగిపోయాడు. ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు మేకర్స్. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. దాంతో మూవీ చూసిన అభిమానులు సినిమా ఎలా ఉందో.. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఫస్టాఫ్ కొద్దిగా ఫ్యామిలీ టచ్ ఇచ్చినప్పటికీ.. సెకండాఫ్ లో మాత్రం నాని ఊచకోత కోశాడని చెబుతున్నారు. డైరెక్టర్ స్టోరీని చాలా అద్బుతంగా రాసుకున్నాడని, విలన్ గా ఎస్ జే సూర్య మరోసారి అదరగొట్టేశాడని పేర్కొంటున్నారు. ‘ప్రియాంక మోహన్ చాలా క్యూట్ గా నటించింది, ఆమె బ్యూటీ సినిమాకు ప్లస్ పాయింట్’.

‘ఫస్టాఫ్ ను చాలా ఎంగేజింగ్ గా, నాని పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడని’కొందరు రాసుకొచ్చారు.’ఇంతకు ముందు నాని సినిమాల్లో చూడని యాక్షన్ ఫీస్ట్ ఇందులో ఉంది భయ్యా’ ఆ కొట్టుడుకు థియేటర్లలో గూస్ బంప్స్ ఖాయం’ అని, యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి’. ఎస్ జే సూర్య కొన్ని కొన్ని చోట్ల నానిని డామినేట్ చేశాడని చెప్పుకొచ్చారు. సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని, జేక్స్ బిజోయ్ అదరగొట్టేశాడు అని ఇంకొందరు ట్విట్ చేశారు. హాస్పటల్ దగ్గర జరిగే ఫైట్ సీక్వెన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఈ సీన్ కు థియేటర్లు విజిల్స్ తో దద్దరిల్లుతాయి, బొమ్మ మాస్ బ్లాక్ బస్టర్ అంటూ తమ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేశారు కొందరు నెటిజన్లు. మెుత్తానికి నాని మాస్ యాక్షన్ ఫీస్ట్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని పక్కాగా చెబుతున్నారు.

Show comments