iDreamPost
android-app
ios-app

అప్పుడు బాపు బొమ్మగా ఉండే ఈ నటి.. ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

  • Published Aug 31, 2024 | 7:31 PM Updated Updated Sep 02, 2024 | 9:40 AM

డైరెక్టర్ వంశీ- అల్లరి నరేష్ కాంబోలో వచ్చిన చిత్రం సరదాగా కాసేపు . ఈ మూవీలో కుందనపు బొమ్మగా నటించిన హీరోయిన్ గుర్తుందా.. ఆమె ఎంతలా మారిపోయిందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

డైరెక్టర్ వంశీ- అల్లరి నరేష్ కాంబోలో వచ్చిన చిత్రం సరదాగా కాసేపు . ఈ మూవీలో కుందనపు బొమ్మగా నటించిన హీరోయిన్ గుర్తుందా.. ఆమె ఎంతలా మారిపోయిందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

  • Published Aug 31, 2024 | 7:31 PMUpdated Sep 02, 2024 | 9:40 AM
అప్పుడు బాపు బొమ్మగా ఉండే ఈ నటి.. ఇప్పుడు ఎంతలా మారిందంటే..?

సినిమాలందు వంశీ తెరకెక్కించిన మూవీలు వేరయా. ఆయన సినిమాల్లో హీరోయిన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. అందంగానే కాదు గ్లామరస్ పాత్రల్లోనూ చూపిస్తుంటారు. అందుకు ప్రతి హీరోయిన్ అతడి చిత్రాల్లో నటించాలని కోరుకుంటూ ఉంటుంది. మంచు పల్లకి దగ్గర నుండి ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ వరకు ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. వాటిల్లో ఒకటి అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సరదాగా కాసేపు. దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మరో హీరో. ఇందులో నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా. మణిమాల పాత్రలో మెప్పించిన ఆ అమ్మడి పేరు మధురిమ. తెలుగింటి అమ్మాయిలా .. చక్కటి కట్టుబొట్టుతో ఆకట్టుకున్న ఈ భామ. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది. మధురిమ కాస్తా నైరా బెనర్జీగా పేరు మార్చుకుని ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తుంది.

ముంబయిలో పుట్టిన మధురిమ… చిన్నప్పటి నుండే శాస్త్రీయ సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. తల్లి వద్ద నుండి హిందూస్థానీ, గజల్స్ నేర్చుకుంది. ఆమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా. అయితే ఆమె మంచి డ్యాన్సర్ అని తెలుసుకున్న ప్రముఖ దర్శకుడు జీవీ అయ్యర్.. ఓ టెలివిజన్ షో కోసం ఆమెను తీసుకున్నాడు. కానీ దర్శకుడు చనిపోవడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మరో వైపు చదువల కారణంగా ఆమెకు ఆఫర్లు వచ్చినప్పటికీ తిరస్కరించింది. 2009లో ఆమెకు తెలుగులో ఓ ఆఫర్ వచ్చింది. అదే ఆ ఒక్కడు. విజయ్, సురేష్ గోపి మెయిన్ లీడ్స్. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సక్సెస్ కాకపోయినప్పటికీ.. ఆమెకు మంచి మార్కులు పడటంతో వరుస ఛాన్సులు వచ్చాయి. అలా వంశీ చిత్రంలో యాక్ట్ చేసి మెప్పించింది. మౌనరాగంతో పాటు ఆరెంజ్ మూవీలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది అమ్మడు.

వెంకటేశ్ షాడో, వేటతో పాటు మారుతి కొత్త జంటలో పెంటమ్మ పాత్రలో మెరిసింది ఈ ముంబయి భామ. టెంపర్‌లో లక్ష్మీగా అలాగే దోచేయ్ చిత్రంలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఈ తర్వాత ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ చిత్రాలు చేయలేదు. అప్పటికే మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. దీంతో మెల్లిగా అటు వైపుగా సినిమాలు చేసి.. తర్వాత నైరా బెనర్జీగా పేరు మార్చుకుని.. బుల్లితెరపై సందడి చేయడం స్టార్ట్ చేసింది. ఫియర్ ఫ్యాక్టరీ వంటి రియాలిటీ షోస్‌తో పాటు కొన్ని సీరియళ్లలో కనిపించింది. అప్పుడు బాపు బొమ్మలా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా..? అస్సలు నమ్మలేని విధంగా.. అప్పట్లో కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నాజుగ్గా మరింత అందంతో మెస్మరైజ్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Nyrraa M Banerji (@nyra_banerjee)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş