Aditya N
సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఏ వతన్ మేరే వతన్ ట్రైలర్‌ను ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా విడుదల చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ను తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓటీటీ దిగ్గజం షేర్ చేసింది.
సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఏ వతన్ మేరే వతన్ ట్రైలర్‌ను ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా విడుదల చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ను తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓటీటీ దిగ్గజం షేర్ చేసింది.
Aditya N
ఈ మధ్యాహ్నం, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఏ వతన్ మేరే వతన్ ట్రైలర్‌ను ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియాలో అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్రంలో సారా ఒక మహిళా రేడియో బ్రాడ్ కాస్టర్ అవడంతో పాటు భారతదేశ స్వాతంత్ర్యానికై పోరాడే పాత్రను పోషించారు. అయితే ఎవరి స్ఫూర్తి అధికారికంగా ఈ పాత్రను రాశారో నిర్మాతలు ప్రకటించనప్పటికీ, సారా అలీ ఖాన్ పోషించిన పాత్ర భారతదేశంలోని ప్రముఖ మహిళా న్యూస్ రీడర్, స్వాతంత్య్ర సమరయోధురాలు, ప్రసారకర్త అయిన ఉషా మెహతా జీవితాన్ని ఆధారంగా చేసుకుని చిత్రీకరించారని తెలుస్తోంది.
ఏ వతన్ మేరే వతన్ సారా అలీ ఖాన్ కెరీర్ గ్రాఫ్‌ని ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళగలదని ట్రైలర్ చూసిన నెటిజన్లు భావిస్తున్నారు. డైలాగ్ డెలివరీతో పాటు నటన అద్భుతంగా ఉందని అంటున్నాయి. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఈ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయాలని కూడా అన్నారు. ఈ చిత్రం సారా అలీ ఖాన్ కెరీర్ కి గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని కూడా అంటున్నారు.
ప్రైమ్ వీడియోలో సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఏ వతన్ మేరే వతన్ స్ట్రీమింగ్ కానుంది. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ను తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓటీటీ దిగ్గజం షేర్ చేసింది. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. బొంబాయిలోని కళాశాలలో చదువుకునే 22 ఏళ్ల ఆమ్మయిగా ట్రైలర్ సారా పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది, ఆమె భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడంలో సహాయపడే ప్రయత్నంలో భూగర్భ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని తనదైన శైలిలో ముందుండి నడిపిస్తుంది. ఆమె పాత్ర చేసే ప్రయాణం ద్వారా, ట్రైలర్ భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశంలోని యువత యొక్క ధైర్యం, త్యాగాలని హైలైట్ చేస్తుంది.
ఈ చిత్రం వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది. కాగా భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటంలోని ఒక కీలకమైన ఎపిసోడ్ ను వివరిస్తుంది. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతాతో పాటు సోమెన్ మిశ్రా నిర్మించారు. కన్నన్ అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, అభయ్ వర్మ, స్పర్ష్ శ్రీవాస్తవ్, అలెక్స్ ఓ’ నెల్ తో పాటు ఆనంద్ తివారీ కీలక పాత్రలు పోషించారు. అంతే కాకుండా ఇమ్రాన్ హష్మీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా కన్నన్, దరాబ్ ఫరూఖీ రచించారు. మార్చి 21న ప్రైమ్ వీడియోలో హిందీ, తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో “ఏ వతన్ మేరే వతన్” సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.
rising from the shadows of history, a tale of unyielding courage emerges
witness the journey unfold in #AeWatanMereWatanOnPrime, Mar 21 pic.twitter.com/4yQL2cgg7j— prime video IN (@PrimeVideoIN) March 4, 2024