iDreamPost
android-app
ios-app

సైలెంట్​గా ఎంగేజ్​మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు! కారణం?

  • Author singhj Published - 06:32 PM, Wed - 19 July 23
  • Author singhj Published - 06:32 PM, Wed - 19 July 23
సైలెంట్​గా ఎంగేజ్​మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు! కారణం?

సినీ స్టార్స్​కు మన దేశంలో ఏ రేంజ్​లో క్రేజ్ ఉంటుందో తెలిసిందే. స్క్రీన్​పై తమ టాలెంట్​తో అద్భుతాలు చేసే నటీనటులకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారిని ఆరాధించే వాళ్లు కూడా కోట్ల సంఖ్యలో ఉంటారు. యాక్టర్స్​తో పాటు డైరెక్టర్స్ లాంటి టెక్నీషియన్స్​కు కూడా అభిమానులు భారీ సంఖ్యలో ఉంటారు. సినిమాలకు అన్నీ తామై నడిపించే దర్శకులకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే అతికొద్ది మంది దర్శకులకు మాత్రమే ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి అరుదైన దర్శకుల్లో బాలీవుడ్ దర్శక, నిర్మాత సంజయ్​ లీలా భన్సాలీ ఒకరు. హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్స్​లో ఒకరిగా సంజయ్ లీలా భన్సాలీ కొనసాగుతున్నారు.

‘దేవదాస్’, ‘రామ్​లీల’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’, ‘గంగూబాయి కతియావాడీ’ లాంటి సినిమాలతో బాలీవుడ్ ఆడియెన్స్ మనసుల్లో భన్సాలీ చెరగని ముద్ర వేశారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తోందంటే చాలు.. ఏదో కొత్తదనం ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. అలాంటి స్టార్ డైరెక్టర్ మేనకోడలు ఎంగేజ్​మెంట్ చేసుకున్నట్లు బీటౌన్​లో చర్చ నడుస్తోంది. భన్సాలీ మేనకోడలు, నటి షర్మిన్ సెగల్ ఒక వజ్రాల వ్యాపారిని మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ సంవత్సరం ప్రారంభంలో షర్మిన్ నిశ్చితార్థం వేడుక రహస్యంగా జరిగిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి కూడా చేసుకోనున్నారట. అహ్మదాబాద్​కు చెందిన వజ్రాల వ్యాపారితో ఆమె నిశ్చితార్థం చేసుకున్నారట.

ఈ సంవత్సరం చివర్లో ఇటలీలో పెళ్లి చేసుకోవాలని షర్మిన్ నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే తనకు కాబోయే భర్త గురించి ఆమె ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదు. గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఎంగేజ్​మెంట్, మ్యారేజ్​కు సంబంధించిన విషయాలను బయటకు చెప్పట్లేదని బాలీవుడ్ టాక్. కాగా.. నటిగా ఎంట్రీ ఇవ్వకముందు భన్సాలీతో కలసి పనిచేశారు షర్మిన్. ‘రామ్​లీలా’, ‘బాజీరావ్​ మస్తానీ’, ‘గంగూబాయి’ లాంటి సినిమాలకు భన్సాలీ దగ్గర షర్మిన్ అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేశారు. ‘మలాల్’, ‘అతిథి భూతో భవ’ సినిమాలతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారామె. ప్రస్తుతం భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘హీరామండి’ వెబ్​ సిరీస్​లో యాక్ట్ చేస్తున్నారు షర్మిన్. ఇందులో సోనాక్ష్మీ సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ లాంటి స్టార్లు కూడా యాక్ట్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş