iDreamPost
android-app
ios-app

Sundeep Kishan: భైరవ కోన ప్రీమియర్ టికెట్స్ కొన్నారా? అయితే మీకో బంపరాఫర్

  • Published Feb 14, 2024 | 6:12 PM Updated Updated Feb 14, 2024 | 6:12 PM

యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం "భైరవకోన". అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో అప్ డేట్ ను ప్రకటించాడు హీరో. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం "భైరవకోన". అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మరో అప్ డేట్ ను ప్రకటించాడు హీరో. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 14, 2024 | 6:12 PMUpdated Feb 14, 2024 | 6:12 PM
Sundeep Kishan: భైరవ కోన ప్రీమియర్ టికెట్స్ కొన్నారా? అయితే మీకో బంపరాఫర్

ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతో మంది హీరోలు సిద్ధంగా ఉన్నారు. కానీ, కొన్ని సార్లు ఎంత కష్టపడినా కూడా  ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతాయి. అయినా సరే, అక్కడే ఆగిపోకుండా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ .. ఎంతో మంది హీరోలు సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఈ కోవకు చెందినవాడే హీరో “సందీప్ కిషన్”. ఎప్పటికపుడు తన లుక్ ని మార్చుకుని.. ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తూ.. మంచి కంటెంట్ ను అందిస్తూ ఉంటాడు ఈ హీరో. కానీ, ఈ మధ్య కాలంలో ఈ హీరో ఖాతాలో సక్సెస్ పడి చాలా కాలమే అయింది. ఇక ఇప్పుడు ఈ హీరో తాజాగా నటించిన చిత్రం “భైరవ కోన”. అయితే, ఈ చిత్రానికి సంబంధించి.. టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటూ సందీప్ చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

అయితే, “భైరవ కోన” చిత్రానికి వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, మొదట ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేసిన మేకర్స్ .. ముందుగానే వారి చిత్రానికి స్పెషల్ షోస్ వేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ను చూస్తుంటే .. ఇదొక సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం అని అర్థమౌతోంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్యతాపర్ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా, ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఇక ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ .. టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటూ.. తన చిత్రం ప్రీమియర్ టికెట్స్ ను కొనుగోలు చేసిన వారికీ.. ఆంధ్ర , తెలంగాణ , చెన్నై లో ఉండే వివాహభోజనంబు అవుట్ లెట్స్ వద్ద .. ప్రీమియర్ టికెట్స్ చూపించి 20% డిస్కౌంట్ పొందవచ్చని ప్రకటించారు.

కాగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ ను బట్టి చూస్తుంటే.. ఇప్పటివరకు ఈ చిత్రం పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంటుంది. ఇక పూర్తిగా విడుదల అయిన తర్వాత ఈ చిత్రం ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా కోసం ప్రీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి , ఈసారైనా సందీప్ ఖాతాలో హిట్ పడుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరి, ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş