iDreamPost
iDreamPost
ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగనుంది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు ప్యాన్ ఇండియా సినిమాలు తలపడనున్నాయి. మూడు ఒకదానికి మరొకటి సంబంధం లేని జానర్లే అయినప్పటికీ ప్రేక్షకులు ఛాయస్ గా ఒకటో రెండో పెట్టుకుంటారు కాబట్టి గెలుపు ఎవరిదన్న ప్రశ్న తలెత్తడం సహజం. ముందుగా అందరి చూపు నిలుస్తుంది మేజర్ మీదే. అడవి శేష్ హీరోగా గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ ఇప్పటికీ దేశంలో కొన్నిచోట్ల ప్రీ రిలీజ్ ప్రీమియర్లు జరుపుకుంది. అన్నిచోట్లా చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. మహేష్ బాబు నిర్మాతల్లో ఒకరన్న సంగతి తెలిసిందే
రెండోది కమల్ హాసన్ విక్రమ్. ఖైదీ మాస్టర్ ల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ లు నటించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. బోనస్ గా సూర్య క్యామియో కూడా ఉంది. తెలుగులో ఆశించినంత బజ్ లేనప్పటికీ టాక్ ని నమ్ముకుని ఉన్నారు నిర్మాతలు. వెంకటేష్ అతిథిగా ఇవాళ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. సుమారు 6 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ రిపోర్ట్. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ఇంత రికవరీ కావడం కష్టం. కమల్ మార్కెట్ ఇక్కడ తగ్గిపోయిన దృష్ట్యా ఓపెనింగ్స్ భారీగా అనుమానమే. ఇది అన్ని ప్రధాన భాషల్లోనూ రానుంది.
ఇక మూడోది అక్షయ్ కుమార్ సామ్రాట్ పృథ్విరాజ్. హిందీతో పాటు తెలుగు తమిళంలో తదితర భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ గ్రాండియర్ మీద ఎందుకో చెప్పుకునేంత బజ్ లేదు. భూల్ భూలయ్య 2 సక్సెస్ ని ఇది కొనసాగిస్తుందనే నమ్మకం అక్కడి ఎగ్జిబిటర్లలో వ్యక్తమవుతోంది. కానీ సౌత్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నీరసంగా ఉన్నాయి. యావరేజ్ అనిపించుకున్నా లాభం లేదు. నష్టం వచ్చేస్తుంది. ప్రమోషన్లు కూడా సోసోగానే ఉన్నాయి. ఇన్నేసి లాంగ్వేజెస్ లో వస్తున్న మేజర్, విక్రమ్, సామ్రాట్ పృథ్విరాజ్ లలో ఎవరు విజేత నిలుస్తారో ఎవరు పరాభవంతో వెనుదిరుగుతారో ఇంకో మూడు రోజుల్లో తేలిపోతుంది.