iDreamPost
android-app
ios-app

‘ఖుషి’ ట్రైలర్ విషయంలో ట్రోల్స్! సమంత కొత్త ట్వీట్ వారి గురించేనా..?

  • Author ajaykrishna Updated - 09:40 AM, Mon - 14 August 23
  • Author ajaykrishna Updated - 09:40 AM, Mon - 14 August 23
‘ఖుషి’ ట్రైలర్ విషయంలో ట్రోల్స్! సమంత కొత్త ట్వీట్ వారి గురించేనా..?

ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు ట్రోల్స్ ని పెద్దగా పట్టించుకోరు. వాటిని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే.. ట్రోలింగ్ అనేది ఎప్పుడు కూడా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ని టచ్ చేస్తూ.. డామేజ్ చేసే విధంగా ఉండకూడదని చెబుతుంటారు. అలాంటిది తెలిసి తెలియక సెలబ్రిటీల లైఫ్ పై లేనిపోని విమర్శలకు దిగితే.. వాస్తవాలు తెలియకుండా మాట్లాడొద్దు అని వారు కూడా ఘాటుగా రియాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత అలాంటి మూడ్ లోనే ఉందని అంటున్నారు. సమంత ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధి చికిత్స కోసం విదేశాలలో ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సమంత హీరోయిన్ గా నటించిన ‘ఖుషి’ మూవీ ట్రైలర్ విడుదలైంది.

మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. కాగా.. ఈ సినిమా సెప్టెంబర్ 1 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పాటలతో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ట్రైలర్ తో మరింత హైప్ పెంచేసింది. దీంతో ఎప్పుడెప్పుడు విజయ్, సామ్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల జరిగిన ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సమంత రాలేకపోయింది. ఈ క్రమంలో ట్రైలర్ ఈవెంట్ కి సమంత రాకపోవడంతో కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ గుప్పిస్తున్నారు.

ఓవైపు తన గురించి విమర్శలు వస్తుండగా.. తాజాగా సమంత ఓ ట్వీట్ పెట్టి అందరికి షాకిచ్చింది. ఆ ట్వీట్ చూస్తే ఖచ్చితంగా తన ట్రోల్ చేసేవారి కోసమే కాబోలు అనిపిస్తుంది. ఇంతకీ సామ్ ఏమని ట్వీట్ చేసిందంటే.. “మీరు ఈ ప్రపంచం కోసం బ్రతకాల్సిన అవసరం లేదు. ముందు మీ స్థాయిని తెలుసుకొని.. తర్వాత మీ గౌరవాన్ని పెంచుకోవాలి. ఇతరుల కోసం కాకుండా మీకోసం మీరు జీవించాలి. ఈ సమాజం మిమ్మల్ని గుర్తించకపోవచ్చు. అందుకే.. పదిమందిలో ఒకరిగా కాకుండా మీకోసం మీరు నిలబడటం మంచిది” అంటూ పేర్కొంది. ప్రస్తుతం సామ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న ఖుషి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సామ్ హాజరు అవుతుందని టాక్. మరి సమంత ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss