iDreamPost
android-app
ios-app

మీకోసమే ఈ హార్డ్ వర్క్! ఖుషి ఈవెంట్ లో సమంత ఎమోషనల్!

  • Author ajaykrishna Updated - 08:57 AM, Wed - 16 August 23
  • Author ajaykrishna Updated - 08:57 AM, Wed - 16 August 23
మీకోసమే ఈ హార్డ్ వర్క్! ఖుషి ఈవెంట్ లో సమంత ఎమోషనల్!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా ‘ఖుషి’. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. కాగా.. ఇప్పటికే ఖుషి మూవీకి సాంగ్స్, ట్రైలర్ లతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అసలే ఇటు విజయ్ కి.. అటు సమంతకు ప్రస్తుతం హిట్టు ఖచ్చితంగా పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. వీరిద్దరి చివరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. మరోవైపు డైరెక్టర్ శివ నిర్వాణకు కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. అయితే.. రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో ఖుషి టీమ్ హైదరాబాద్ లో లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించింది.

ఒక రకంగా ఈ లైవ్ కన్సర్ట్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా జరిగిందని చెప్పాలి. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఖుషి లైవ్ కన్సర్ట్ లో సమంత ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆ తర్వాత స్టేజ్ పై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. సమంత కొన్నాళ్ళుగా మయోసైటీస్ తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం చేస్తున్న సినిమాలన్నీ పక్కన పెట్టి విరామం తీసుకుంది. చికిత్స పూర్తి అయ్యాక వచ్చి.. తన కెరీర్ ని కంటిన్యూ చేస్తానని చెప్పింది. ఈ సందర్బంగా స్టేజ్ పై సమంత మాట్లాడుతూ.. “షూటింగ్ టైమ్ లో ఈ సాంగ్స్ విన్నప్పటి నుంచి ఆల్బమ్ తో లవ్ లో పడిపోయా. ఇవాళ లైవ్ లో మీ అందరూ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ ఎనర్జీ చూసి నేను సెప్టెంబర్ 1st కు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీతోనే సినిమా చూడాలి అనిపిస్తోంది. ఎప్పుడూ మీకు నచ్చే మంచి సినిమాలు తీయాలనేదే మా ప్రయత్నం. ఈసారి అలాంటి సినిమానే చేశామని నమ్ముతున్నా’ అని చెప్పింది.

అనంతరం ఫ్యాన్స్ అరుపులు, కేకలు.. ఉత్సాహం చూసిన సమంత వారి గురించి మాట్లాడుతూ కాసేపు ఎమోషనల్ గా స్టక్ అయిపోయింది. ఆమె మాట్లాడుతూ.. “నాకు థాంక్స్ చెప్పడానికి మాటలు చాలడం లేదు. ప్రతీ ఒక్కరికి పేరుపేరునా థాంక్స్. ఫ్యాన్స్.. మీకోసమే ఇంతలా హార్డ్ వర్క్ చేస్తున్నా. మళ్లీ హెల్తీగా తిరిగివస్తా.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇస్తా. ఇది నా ప్రామిస్.” అని చెబుతా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం సమంత భావోద్వేగానికి లోనైనా మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత స్పీచ్ విన్నాక ఫ్యాన్స్ కూడా ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. మరి సమంత గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet