iDreamPost
android-app
ios-app

‘సామజవరగమన’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • Author ajaykrishna Published - 03:39 PM, Fri - 21 July 23
  • Author ajaykrishna Published - 03:39 PM, Fri - 21 July 23
‘సామజవరగమన’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఎన్ని అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద పెద్ద పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. భారీ అంచనాలతో విడుదలైన సినిమాలకంటే.. అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రయోగాల పేరుతో భారీ బడ్జెట్ మూవీస్ అన్ని ఓవైపు రిలీజ్ టైమ్ కి సంధిగ్ధంలో పడుతుంటే.. మంచి కామెడీ టచ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చే సినిమాలు బాగా ఆడుతున్నాయి. ముఖ్యంగా కామెడీ టచ్ ఉన్న సినిమాలను జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా తెలుగులో ఫుల్ ఫ్లెడ్జి కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మూవీ ‘సామజవరగమన’.

హీరో శ్రీవిష్ణు, డెబ్యూ హీరోయిన్ రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమా.. జూన్ 29న విడుదలై మంచి విజయం సాధించింది. విడుదల అయ్యాక దాదాపు రెండు వారాలకు పైగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబట్టి.. శ్రీవిష్ణు కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో స్థానం సంపాదించుకుంది ఈ సామజవరగమన. సినిమాకి పెట్టిన బడ్జెట్ కి దాదాపు మూడు నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని సినీ వర్గాలు క్లారిటీ ఇచ్చేశాయి. బ్రోచేవారెవరురా, రాజరాజచోర మూవీస్ తర్వాత శ్రీవిష్ణు కెరీర్ చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని ఈ కామెడీ స్క్రిప్ట్ ఎంపిక చేసుకున్నాడు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్టు.

ఇక కామెడీ జానర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో తెలిసిందే. ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే.. అద్భుతమైన కలెక్షన్స్ కూడా అందిస్తారు. ఈ సినిమాని దర్శకుడు రామ్ అబ్బరాజు అద్భుతమైన కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ మరో ప్లస్. ఫైనల్ గా జూన్ నెలలో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న సామజవరగమన.. ఓటిటి ప్రేక్షకులను కూడా అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ రిలీజైన నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. సామజవరగమన ఓటిటి హక్కులను తెలుగు ఓటిటి ఆహా సొంతం చేసుకుంది. కాగా.. జులై 28 నుండి సామజవరగమన మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇంకా ఆలస్యం ఎందుకు.. సామజవరగమన మూవీని ఆహాలో ఎంజాయ్ చేయండి. మరి సామజవరగమన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom