iDreamPost
android-app
ios-app

బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’ మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

  • Published Jul 12, 2023 | 10:22 AM Updated Updated Jul 12, 2023 | 10:22 AM
  • Published Jul 12, 2023 | 10:22 AMUpdated Jul 12, 2023 | 10:22 AM
బ్లాక్ బస్టర్ ‘సామజవరగమన’ మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

ఈ మధ్యకాలంలో అంచనాలతో విడుదలైన సినిమాలకంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ప్రయోగాలు, బిగ్ బడ్జెట్ మూవీస్ సంగతి పక్కన పెడితే.. కామెడీ టచ్ ఉన్న సినిమాలు మాత్రం సేఫ్ అయిపోతున్నాయి. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలను జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఆదరిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఫుల్ ఫ్లెడ్జి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన మూవీ ‘సామజవరగమన’. హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 29న ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై రెండు వారాలు అవుతున్నా.. ప్రేక్షకులు ఇంకా బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ఆల్రెడీ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి మూడు నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. శ్రీవిష్ణుతో పాటు ఈ సినిమాలో ఆర్టిస్ట్ లందరు అద్భుతమైన కామెడీ పండించి.. మూవీని పెద్ద హిట్ చేశారు. అందులోనూ కామెడీ జానర్ సినిమాలకు మన తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో తెలుసు కదా! ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే.. అద్భుతమైన కలెక్షన్స్ కూడా అందిస్తుంటారు. ఈ సినిమా హీరో శ్రీవిష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం.

ఇదిలా ఉండగా.. సామజవరగమన మూవీని అంత అద్భుతంగా మలిచి.. తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు రామ్ అబ్బరాజును కూడా అభినందించాలి. ఇంకా గోపి సుందర్ మ్యూజిక్ కూడా ప్లస్ అయింది. మొత్తానికి జూన్ నెలలో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న సామజవరగమన.. ఓటిటి ప్రేక్షకులను కూడా అలరించేందుకు రెడీ అవుతోంది. సినిమా విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రానుందని తెలుస్తోంది. సామజవరగమన ఓటిటి హక్కులను తెలుగు ఓటిటి ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా.. మూవీ వచ్చేసి జులై 22 లేదా 25 నుండి స్ట్రీమింగ్ కాబోతుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి సామజవరగమన మూవీ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet