iDreamPost
android-app
ios-app

Salute Report : సెల్యూట్ రిపోర్ట్

  • Published Mar 18, 2022 | 4:30 PM Updated Updated Dec 20, 2023 | 6:44 PM

ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో బ్రేక్ ఈవెన్ లో సగం డబ్బులు కూడా రాలేదు. దీనికన్నా కురుప్ ఇక్కడ బాగానే ఆడిన సంగతి మర్చిపోకూడదు.

ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో బ్రేక్ ఈవెన్ లో సగం డబ్బులు కూడా రాలేదు. దీనికన్నా కురుప్ ఇక్కడ బాగానే ఆడిన సంగతి మర్చిపోకూడదు.

  • Published Mar 18, 2022 | 4:30 PMUpdated Dec 20, 2023 | 6:44 PM
Salute Report : సెల్యూట్ రిపోర్ట్

ఈ మధ్యకాలంలో తెలుగులోనూ దుల్కర్ సల్మాన్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. మహానటితో గుర్తింపు తెచ్చుకుని కనులు కనులు దోచాయంటేతో తొలి సోలో హిట్టు కొట్టిన ఈ మమ్ముట్టి వారసుడికి ఇటీవలే హే సినామిక పెద్ద షాకే ఇచ్చింది. ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో బ్రేక్ ఈవెన్ లో సగం డబ్బులు కూడా రాలేదు. దీనికన్నా కురుప్ ఇక్కడ బాగానే ఆడిన సంగతి మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో సోనీ లివ్ లో డైరెక్టర్ ఓటిటి రిలీజ్ అందుకున్న సెల్యూట్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఈ రోజే అయినప్పటికీ నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్ర నిరసన సెగ అందుకున్న ఈ మూవీ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

అరవింద్(దుల్కర్ సల్మాన్)ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన తన అన్నయ్య అజిత్(మనోజ్ కె జయన్)ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఉద్యోగంలోకి అడుగు పెడతాడు. కానీ ఇతను కోరుకున్నట్టు డిపార్ట్ మెంట్ లో పరిస్థితులు ఉండవు. ఓ అమాయకుడి మీద నేరం మోపే విషయంలో అజిత్ తో విధేబాలు వస్తాయి. దీంతో లాంగ్ లీవ్ తీసుకుని అసలు హంతకుడిని పట్టుకునే వేట మొదలుపెడతాడు. ఖాకీ దుస్తుల్లో చేయలేనిది బయట ఎలా సాధిస్తాడనే ప్రశ్నకు సమాధానం సినిమాలో చూడాలి. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటిలాగే టాప్ నాచ్ లో ఉన్నాయి. మరోసారి సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ కాప్ థ్రిల్లర్ లో పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కథనంలో ఉన్న లోపాల వల్ల బాగా నెమ్మదిగా సాగుతుంది. టేకాఫ్ బాగానే ఉన్నప్పటికీ దాన్ని కొనసాగించిన విధానం సోసోగానే అనిపిస్తుంది. అయినప్పటికీ మరీ విసుగు రాకుండా ఇలాంటి జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులను ఓ మాదిరిగా సంతృప్తి పరచడంలో సెల్యూట్ సక్సెస్ అయ్యింది. అది కూడా పరిమిత అంచనాలు ఉంటేనే. క్లైమాక్స్ మరీ ఎగ్జైటింగ్ గా లేదు. ఓటిటి వాచ్ కాబట్టి ఓవరాల్ గా డీసెంట్ అనిపించుకుంటుంది. ఒకవేళ థియేటర్లో వచ్చి ఉంటే మన ఆడియన్స్ అంతగా కనెక్ట్ అయ్యేది కాదు. ఆప్షన్ లేదనుకుంటే సెల్యూట్ ఓసారి కొట్టేయొచ్చు. నో ప్రాబ్లమ్

Also Read : Stand Up Rahul Report : స్టాండ్ అప్ రాహుల్ రిపోర్ట్

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet