iDreamPost
android-app
ios-app

Stand Up Rahul Report : స్టాండ్ అప్ రాహుల్ రిపోర్ట్

  • Published Mar 18, 2022 | 3:20 PM Updated Updated Mar 18, 2022 | 3:20 PM
Stand Up Rahul Report : స్టాండ్ అప్ రాహుల్ రిపోర్ట్

ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాల్లో స్టాండ్ అప్ రాహుల్ ఒక్కటే అంతో ఇంతో మినిమమ్ బజ్ తో విడుదలయ్యింది. వరస ఫ్లాపులతో మార్కెట్ ఏనాడో తగ్గిపోయిన రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో వర్ష బొల్లమ హీరోయిన్. టీమ్ ముందు నుంచి దీని మీద కాన్ఫిడెంట్ గానే ఉంది. ఆర్ఆర్ఆర్ కు కేవలం వారం రోజులు ఉన్నప్పటికీ అంత తక్కువ గ్యాప్ లో రిలీజ్ కు సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకిది బ్రేక్ ఇస్తుందని బలంగా నమ్ముతున్న రాజ్ తరుణ్ నమ్మకాన్ని నెరవేర్చే బాధ్యతని దర్శకుడు శాంటో తీసుకున్నారు. మరో నిజంగా అది జరిగేలా మూవీ ఉందా లేక హీరో ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పేలా లేదా చూద్దాం.

తండ్రి(మురళీశర్మ)వదిలేసిపోతే తల్లి(ఇంద్రజ) పెంపకంలో పెద్దవుతాడు రాహుల్(రాజ్ తరుణ్). ఈ కారణంగానే వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాక శ్రేయ(వర్ష బొల్లమ)తో పరిచయం జరిగి అది కాస్తా లివ్ ఇన్ రిలేషన్ వరకు వెళ్తుంది. స్టాండ్ అప్ కామెడీతో పేరు తెచ్చుకోవాలని కలలు కన్న రాహుల్ వాటిని నెరవేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెడతాడు. తనకు శ్రేయ అండగా నిలబడుతుంది. మరి తన లక్ష్యాన్ని ఇతను చేరుకోగలిగాడా, ప్రియురాలితో బంధం పెళ్లిదాకా తీసుకెళ్లాడా లేదా అనేది తెరమీద చూడాలి. ఇలాంటి వృత్తి ఉన్న క్యారెక్టరైజేషన్ తో తెలుగులో సినిమాలు అరుదు.

దర్శకుడు శాంటో తీసుకున్న పాయింట్ లో బోలెడు ఎంటర్ టైన్మెంట్ కి స్కోప్ ఉన్నప్పటికీ వీక్ రైటింగ్ తో దాన్ని చెడగొట్టేశారు. కనెక్టివిటీ లేని ఎమోషన్స్ తో పాటు హీరో పాత్రను తీర్చిదిద్దడంలో తలెత్తిన లోపాల వల్ల రాహుల్ బాగా బోర్ కొట్టిస్తాడు. పెర్ఫార్మన్స్ లు బాగున్నప్పటికీ వాటిని పూర్తిగా ఉపయోగించుకునే స్థాయిలో కథాకథనాలు పండలేదు. పైగా స్టాండ్ అప్ కామెడీ పేరుతో వేసిన జోకులు అంతగా పేలకపోవడం అసలు మైనస్. వెన్నెల కిషోర్ తో సైతం ఇరిటేషన్ తెప్పించేశారు. కేవలం ఓ రూపాయి బాగున్న హాస్యం కోసం ప్రేక్షకుడు పది రూపాయలు ఖర్చు పెట్టే రోజులా ఇవి. ఓటిటి ఆడియన్స్ కి అంతో ఇంతో సెట్ అయ్యే ఈ రాహుల్ ని బిగ్ స్క్రీన్ మీద చూడటం కష్టమే. హిట్టు కోసం రాజ్ తరుణ్ వేట కంటిన్యూ కాక తప్పదు. ఇలాంటి వాటితో ఏం మేజిక్ ఆశిస్తాం

Also Read : RRR Events : రాజమౌళిని మించిన మార్కెటింగ్ గురు ఉంటారా