iDreamPost
android-app
ios-app

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. డైనోసార్‌ వచ్చేది అప్పుడే!

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. డైనోసార్‌ వచ్చేది అప్పుడే!

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘సలార్‌’. కేజీఎఫ్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల విషయంలో చాలా రోజుల నుంచి సస్పెన్స్‌ నడుస్తోంది. తేదీలు మారుతూ వస్తున్నాయి. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చిత్ర బృందంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వ్యాప్తంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది.  మూవీ రిలీజ్‌ కన్‌ఫర్మ్‌ అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా 2023, డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇందుకు సంబంధించిన అఫిషియల్‌ కన్‌ఫర్‌మేషన్‌ను చిత్ర బృందం త్వరలో ఇ‍వ్వనుందట. ఈ న్యూస్‌ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా, సలార్‌ సినిమాను కేజీఎఫ్‌ సినిమా నిర్మాతలే తెరకెక్కుస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తున్నారు. జగపతిబాబు, పృధ్వీరాజ్‌ సుకుమారన్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇక, సలార్‌ సినిమా నుంచి వస్తున్న ప్రతీ అప్‌డేట్‌కు పీక్స్‌లో రెస్పాన్స్‌ అందుతోంది. పోస్టర్ల దగ్గరినుంచి టీజర్‌ వరకు ఫైర్‌ పుట్టించాయి. యూట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ సంపాదించి రికార్డు సృష్టించాయి. సలార్‌ ట్రైలర్‌ ఇదే పంథాను కొనసాగించే అవకాశం లేకపోలేదు. ఫ్యాన్స్‌తో పాటు సగటు ప్రేక్షకుడు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా కేజీఎఫ్‌ సినిమా రికార్డులను బద్ధలు కొడుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేజీఎఫ్‌ 1200 కోట్ల రికార్డును సలార్‌ తుడిచిపెట్టేస్తుందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. మరి, సలార్‌ రిలీజ్‌ డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabet