iDreamPost
android-app
ios-app

Salaar Dialogues: వైరల్ అవుతున్న ‘సలార్’ డైలాగ్స్.. గూస్​బంప్స్ రావాల్సిందే..!

  • Published Dec 23, 2023 | 1:40 PM Updated Updated Dec 23, 2023 | 4:23 PM

Salaar Movie Dialogues: రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సలార్’ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Salaar Movie Dialogues: రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సలార్’ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

  • Published Dec 23, 2023 | 1:40 PMUpdated Dec 23, 2023 | 4:23 PM
Salaar Dialogues: వైరల్ అవుతున్న ‘సలార్’ డైలాగ్స్.. గూస్​బంప్స్ రావాల్సిందే..!

రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సలార్’ ఎట్టకేలకు బిగ్​స్క్రీన్స్​లోకి వచ్చేసింది. డార్లింగ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్, ఆడియెన్స్​ను ఎంతగానో ఊరిస్తూ వచ్చిన ‘సలార్’ శుక్రవారం రిలీజ్ అయింది. ఎర్లీ మార్నింగ్ షో నుంచే ప్రభాస్ కొత్త చిత్రానికి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేసింది. అందరూ పెట్టుకున్న ఎక్స్​పెక్టేషన్స్​, రిలీజ్​కు ముందు నెలకొన్న బజ్​కు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో బొమ్మ సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కటౌట్​కు న్యాయం జరిగిందని.. ఆయన్ను ఎలా చూడాలని కోరుకున్నామో అలాగే ప్రశాంత్ నీల్ చూపించారని అభిమానులు అంటున్నారు. ‘సలార్’లో తన యాక్టింగ్​తో ప్రభాస్ మెస్మరైజ్ చేశారని.. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్​తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మెంటల్ ఎక్కించారని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

‘సలార్’కు వచ్చిన పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీని బట్టి చూస్తే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్​లో ‘ఆర్ఆర్ఆర్’ను దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. వారం రోజుల పాటు వసూళ్లు స్ట్రాంగ్​గా ఉంటే కింగ్ ఖాన్ షారుక్ ‘జవాన్’ను కూడా ఈజీగా పక్కకు నెట్టేస్తుందని చెబుతున్నారు. యూఎస్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ మేనియా వేరే లెవల్లో ఉంది. నార్త్​ ఇండియాలోనూ ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. అయితే షారుక్ ‘డంకీ’ కోసం థియేటర్లను భారీగా బ్లాక్ చేయడంతో ‘సలార్’కు సింగిల్ స్క్రీన్స్​తో పాటు మల్టీప్లెక్సుల్లోనూ ఇబ్బంది ఎదురవుతోందని తెలుస్తోంది. ఒకవేళ ఆ సమస్య తీరితే ఉత్తరాదిన కూడా ప్రభాస్ ప్రభంజనం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.

ఇక, ‘సలార్’ సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • కొన్ని కథలు వింటే భయం వేస్తుంది. కొన్ని కథలు చూస్తే భయం వేస్తుంది. కానీ.. కొన్ని కథలు తలచుకున్నా భయం వేస్తుంది. వాడి కథ వింటావా?
  • ఇప్పుడు నేనే చెప్తున్నా. ఆ అమ్మాయి కోసం వాళ్లను ఆపు. చేతులు ఎత్తి దండం పెట్టైనా లేకుంటే.. ఎత్తిన చేతిని నరికైనా..
  • ఆ సీల్​ను ఎవ్వరూ ఆపలేరు. కానీ.. ఆ సీల్ సృష్టించింది వాడే.
  • నీ కోసం ఎరయినా అవుతా.. సొరయినా అవుతా. నీ ఒక్కడి కోసం.. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా.
  • ఖాన్సార్ ఎరుపెక్కాల.. మండే నిప్పుతో అయినా.. వీళ్ల రక్తంతో అయినా..
  • గడీల కోసం ముక్కల కోసం కొట్లాడింది చాలు.. నాకు నా కనుచూపు మేర కనిపించేది అంతా కావాలి.
  • పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటకు ఎవరు పోతారా అని కాదు.. లోపలికి ఎవరు వస్తారా అని.
  • ఆరేయ్ బ్యాట్స్ మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు నాకు అన్నీ బిగించే పనులు ఇచ్చార్రా.. అదే ఇరక్కొట్టే పని ఇస్తే.. ఒక్కటే దెబ్బ.
  • వాళ్లెవ్వరూ ఆపరు, ఆపలేరు ఆపగలిగేది నువ్వే.
  • తుప్పు పట్టిన బండి ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు.
  • ఆ నివురుగప్పిన నిప్పుకి గాలి తగలాలి.. దాని వేడి తెలియాలి.
  •  అప్పుడు ఎవ్వరి మీద చెయ్యి ఎత్తొద్దని గీత గీసింది నేనే.. ఇప్పుడు ఆ గీత చెరిపేస్తుంది నేనే.
  • దేవా వీళ్లు ఆగాలి.. కావాలంటే చేతులెత్తి మొక్కు.. లేదంటే ఎత్తిన చేతిని నరికెయ్.
  • ఆనకట్టతో నదిని ఆపగలరు కానీ.. సముద్రాన్ని ఎలా ఆపుతారు?
  • ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయ్.. కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు, బద్ద శత్రువులుగా మారడం.
  • ఖాన్సార్ క సలార్ వరద రాజ్ మన్నార్ క సలార్ సలార్ దేవరథ.
  • ఒక్క ప్రాణం మిగిలినా శౌర్యాంగ ప్రతీకారం ఊహించుకోలేం.
  • దేవాలయాలు కట్టేది మతం వ్యాపించడానికి.. రాజ్యాలు పాలించేది వారసత్వం వ్యాపించడానికి.. ఖాన్సార్ ని నిర్మించింది కేవలం ఒకే ఒక్కటి వ్యాపించడానికి.. అదే భయం.
  • అతని స్థాయి కాపరి అయినా.. వైఖరి ఎప్పడూ దొరలానే ఉంటుంది.
  • మీరు అడగకూడదు కర్త.. ఆజ్ఞపించాలి.
  • బలమున్నోడిదే రాజ్యం.. బలమున్నోడిదే కుర్చీ.
  • గొంతు మారుండొచ్చు.. పిలుపు మారలేదు.
  • పాతికేళ్ల తర్వాత ఇచ్చిన మాట కోసం పుట్టిన నేలకి తిరిగొచ్చాడు.
  • ఖన్సార్ లో కాల్కులేటర్ పట్టుకుని ఏమీ లెక్క పెట్టలేము అందుకే లెక్క పట్టలేని ఒక పిచ్చోడిని తీసుకొచ్చాము.
  • కష్టంలో ఉన్న ప్రతి ఆడదానిలో తన అమ్మని చూసుకుంటున్నాడు.
  • మన కష్టాలు, బాధలు విని కాటేరమ్మ రాలేదు కానీ.. బదులుగా కొడుకుని పంపించింది.
  • చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. వాడు ఊపిరి ఆగే దాకా వీడు ఆగడు.
  • వాడికి రూల్స్ తెలీవేమో.. తెలిసినా వాడు ఫాలో అవ్వడేమో.