iDreamPost
android-app
ios-app

‘సలార్’ పైరసీ కనిపిస్తే ఇలా చేయండి.. ఫ్యాన్స్ కి మేకర్స్ రిక్వెస్ట్!

Salaar Movie: పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కెజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సలార్. సరిగ్గా.. ఒక్క ప్రమోషన్ ఈవెంట్ లేకుండానే.. ఇండియాని షేక్ చేసింది. తాజాగా ఈసినిమా విషయంలో మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓ విజ్ఞప్తి చేశారు.

Salaar Movie: పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కెజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సలార్. సరిగ్గా.. ఒక్క ప్రమోషన్ ఈవెంట్ లేకుండానే.. ఇండియాని షేక్ చేసింది. తాజాగా ఈసినిమా విషయంలో మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓ విజ్ఞప్తి చేశారు.

‘సలార్’ పైరసీ కనిపిస్తే ఇలా చేయండి.. ఫ్యాన్స్ కి మేకర్స్ రిక్వెస్ట్!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని  ప్రభాస్ ఫ్యాన్స్, సినీ  ప్రియులు ‘సలార్’  ఇచ్చిన కిక్ లో ఉన్నారు. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ సినిమాతో తిరిగి తన స్థాయిని నిరూపించుకున్నాడు. డిసెంబర్ 22న మోస్ట్ అవైటెడ్ చిత్రమైన ‘సలార్’ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 21 అర్ధరాత్రి నుంచి స్పెషల్ షోస్ వేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే ‘సలార్’ చిత్రంపై అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. విడుదలైన మొదటి రోజునే భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ‘సలార్’.. రానున్న రోజుల్లో రికార్డ్స్ ను బద్దలుకొట్టడం ఖాయం సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో  థియేటర్స్ లో విడుదలైన చిత్రాలు అన్ని వెంటనే పైరసీ చేసేస్తున్నారు. ఈ క్రమంలో ‘సలార్’ సినిమా కూడా పైరసీ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్ మేకర్స్ ప్రభాస్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు.

‘సలార్’ కు ఇప్పటికే అభిమానుల నుంచి  ఓ రేంజ్ లో స్పందన లభిస్తోంది. అసలు విడుదలకు ముందు ఎటువంటి హడావిడి లేకుండా.. నేరుగా థియేటర్ లోనే విడుదలై అభిమానుల 6 ఏళ్ల ఎదురుచూపులను సాకారం చేసింది ‘సలార్’ . హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో రూపొందించింది. అంతటా ప్రభాస్ మానియా నడుస్తున్న తరుణంలో ఈ చిత్రానికి పైరసీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. కాబట్టి దానికి తగిన చర్యలు తీసుకుంటూ మేకర్స్ ప్రభాస్ అభిమానులను ఒక రిక్వెస్ట్ చేశారు. ‘సలార్’ కు సంబంధించి ఎక్కడైనా పైరసీ కనిపిస్తే.. వెంటనే తమ యాంటీ  పైరసీ టీంకు తెలియజేయాలని చెప్పారు.

అలాగే, ట్విట్టర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ను..  ఎవరైనా పోస్ట్ చేసినా సరే, తమకు తెలుపాలని రిక్వెస్ట్  చేశారు. దీనికి సంబంధించి హోంబలే ఫిల్మ్స్  ట్విట్టర్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. “మీరు పైరసీ కంటెంట్ చూస్తే X@BLOCKXTECHS అంటూ..  రీ ట్వీట్ చేయాలని .. అలాగే ఏదైనా పైరసీ సైట్స్ లో సలార్ మూవీ లేదా..  దీనికి సంబంధించిన ఏ విషయం కనిపించినా REPORT@BLOCKXTECH.COM అనే మెయిల్ కు మెసేజ్ చేయాలని”  నిర్మాతలు..ప్రభాస్ ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.

ఇక , డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ కు.. థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి.  ఇందులో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్ కీలకపాత్రలు పోషించారు.  ఏదేమైనా, డార్లింగ్ ప్రభాస్  బాహుబలి తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో ‘సలార్’ తో భారీ హిట్ అందుకున్నాడని చెప్పి తీరాలి. కాబట్టి, భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి పైరసీని  ఎంకరేజ్ చేయనివ్వకుండా .. మేకర్స్ కు సపోర్ట్ చేయడం.. ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియుల బాధ్యత. మరి.. హోంబలే ఫిల్మ్స్ మేకర్స్ పైరసీ విషయమై ట్వీట్ చేసిన స్పెషల్ రిక్వెస్ట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet