iDreamPost
android-app
ios-app

Ravi Basrur:సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ పేరు వెనుక కన్నీరు పెట్టించే కథ!

  • Published Jan 06, 2024 | 9:32 PM Updated Updated Jan 06, 2024 | 9:32 PM

కేజిఎఫ్ దర్శకుడు రవి బస్రూర్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మారు మోగుతోంది. ఇటీవలే ప్రభాస్ సలార్ సినిమాతో మరోసారి తన సత్తాను చాటుతు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అతని పేరు వెనుక ఉన్న రహస్యం ,తాను ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం ఆ వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకి అతనేవరంటే..

కేజిఎఫ్ దర్శకుడు రవి బస్రూర్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మారు మోగుతోంది. ఇటీవలే ప్రభాస్ సలార్ సినిమాతో మరోసారి తన సత్తాను చాటుతు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అతని పేరు వెనుక ఉన్న రహస్యం ,తాను ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం ఆ వ్యక్తి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకి అతనేవరంటే..

  • Published Jan 06, 2024 | 9:32 PMUpdated Jan 06, 2024 | 9:32 PM
Ravi Basrur:సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ పేరు వెనుక కన్నీరు పెట్టించే కథ!

సంగీత దర్శకుడు రవి బస్రూర్. ఈయన గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కన్నడ నటుడు యాష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ కు సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా గురించి, రికార్డులు సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి చిత్రానికి రవి బస్రూర్ వెన్నుముక్కలా నిలిచి ఆద్భుతమైన సంగీతన్ని అందించాడు. అలాగే  ప్రభాస్ సలార్ సినిమాతో పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నాడు. ఇదిలా ఉంటే.. రవి బస్రూర్ నేడు ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం, అతని పేరు వెనుక ఉన్న రహస్యం గురించి తాజాగా ఓ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే రవి బస్రూర్ తన జీవితాన్ని మార్చేసిన ఓ సంఘటన గురించి వెల్లడించారు. తాజాగా ఆయన కన్నడ సరిగమప సీజన్ 10కి ముఖ్య అతిథిగా వచ్చారు. అక్కడ తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను వివరించారు. అక్కడ రవి బస్రూర్ మాట్లాడుతూ.. ‘సంగీత ప్రపంచంలో నిలదక్కుకొని తానేంటో నిరూపించుకోవాలని ఇంటి నుంచి వచ్చేశాను. అప్పుడు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అలాగే మూడు నాలుగు రోజుల వరకు భోజనం కూడా చేయలేదు, కేవలం నీళ్లు తాగుతూనే గడిపేశాను. కానీ, అప్పుడు నా జేబులో ఒక లిస్ట్ ఉండేది. అది ఏటంటే.. ఏ రోజు ఏ గుడిలో ఎలాంటి ప్రసాదం ఇస్తారో రాసి పెట్టుకున్నాను. అయితే కొన్ని సందర్భల్లో నేను సమయానికి వెళ్లేలేకపోయవాడిని. అప్పుడు నాకు ప్రసాదం దొరికేది కాదు’. అంటూ.. ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు.

Ravi Basrur's tear-jerking story behind his name

‘అలాంటి సమయంలో దేవుడా, నా పరిస్థితి ఏమిటి..? అని చాలా సార్లు మనస్సులో ప్రశ్నలు మొదలయ్యేవి. అప్పుడు ఒక పెద్దాయన నన్ను చూశాడు. అతని పేరు కామత్. అతడు నన్ను బెంగళూరులోని ఎవెన్యూ రోడ్డుకి తీసుకెళ్లాడు. అక్కడ నన్ను ఒక షాపులోకి తీసుకెళ్లి, ఇతను ఇత్తడి, బంగారు వస్తువుల తయారు చేసే పనులు చేస్తాడని యాజమానికి పరిచయం చేశాడు. కానీ, ఇతనికి సంగీతం అంటే పిచ్చి, ఎప్పుడూ చూసిన అదే పనిలో ఉంటాడని తెలిపాడు. కాగా నన్ను పనిలో పెట్టుకోమని చెప్పగా ఆ యాజమాని వెంటనే ఒప్పుకున్నాడు. కానీ.. నేను ఎలాంటి పని చేయను చెప్పాగా ..అప్పుడు ఆ యాజమాని నాకు రూ.5 ఇచ్చి ఏదైనా తిని రమ్మన్నాడు. అప్పుడు అతడు నన్ను చూసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. భవిష్యత్తులో ఇతడిని కలవడానికి 5 నెలలు అపాయింట్ మెంట్ కావాలి అంతలా ఇతని రేంజ్ పేరిగిపోతుందని అన్నాడు. ఆ మాటలు నేను పెద్దగా పట్టించుకోలేదు, ప్రతిఒక్కరూ ఇలాగే చెప్తారని అనుకున్నాను.

Ravi Basrur's tear-jerking story behind his name3

కాగా, అప్పుడు నాకు సంగీతాన్ని మాత్రమే కావాలని ఉన్నాను. దీంతో అతను మీకు ఏం కావాలి అని అడగగా నాకు కీ బోర్డు కావాలి డబ్బు ఇస్తావా అని అడిగాను. దానికి అతను ఎంత కావాలి అని అడగగా నేను రూ.35 వేలు అన్నాను. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నేను ఎవరో తెలియకుండా, క్షణం ఆలోచించకుండా అతను ఆ డబ్బులు ఇచ్చాడు. ఆ సమయంలో నేను చాలా షాక్ అయ్యాను. అలాగే తిరిగి ఇవ్వకు ఈ రూ.35 వేలకే నీకు పని ఇస్తాను, పని చేసి చెల్లించని చెప్పాడు. అలా ఈరోజు నేను ఇంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం అతనే. ఆ సాయం చేసిన వ్యక్తి పేరు రవి. అందుకే నా పేరు తొలగించి అతని పేరును నా పేరుగా మార్చుకున్నాను. నా అసలు పేరు కిరణ్., కానీ.. రవి బస్రూర్ అని పిలుస్తేనే నాకు సంతోషం’ అని ఆయన తెలిపాడు. మరి, రవి బస్రూర్ పేరు వెనుక ఉండే కన్నీటి వ్యధ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.