iDreamPost
android-app
ios-app

Salaar Collections: సలార్‌ ఫస్ట్‌డే కలెక్షన్‌.. అంచనాలు మించి రికార్డు!

Salaar First Day Collection: సలార్‌ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Salaar First Day Collection: సలార్‌ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Salaar Collections: సలార్‌ ఫస్ట్‌డే కలెక్షన్‌.. అంచనాలు మించి రికార్డు!

ప్యాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. విడుదలైన అన్ని చోట్లా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. రివ్యూవర్లు సైతం మంచి రివ్యూలను ఇచ్చారు. ఇక, ఈ సినిమా మొదటి రోజు 150 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందనీ సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  అయితే, సలార్‌ వారి అంచనాలను తారుమారు చేసింది.

ఊహించిన దానికంటే ఎక్కువే వసూళు చేసింది. సలార్‌ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా 130 కోట్ల రూపాయల షేర్‌.. 178.7 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా.. 49 కోట్ల రూపాయల షేర్‌.. 60 కోట్ల రూపాయల గ్రాస్‌ సాధించింది.

  • నైజాం 22. 55 కోట్ల రూపాయలు,
  • సీడెడ్‌లో 6.45 కోట్లు,
  • ఉత్తరాంధ్రలో 4.70 కోట్లు,
  • ఈస్ట్‌ 3.50 కోట్లు,
  • వెస్ట్‌ 3.10 కోట్లు,
  • గుంటూరు 4 కోట్లు,
  • కృష్ణ 2.07 కోట్లు,
  • నెల్లూరు 2 కోట్లు

కాగా, సలార్‌ సినిమా ఏం చేసినా అది రికార్డు అయిపోతోంది. మొదట ప్రేక్షకుల మందుకు వచ్చిన టీజర్‌నుంచి సలార్‌ వేట మొదలైంది. ట్రైలర్‌ డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన 18 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. కేజీఎఫ్‌ 2 సినిమాపై ఉన్న రికార్డులను తుడిచి పెట్టేసింది. సలార్‌ విడుదలకు కొన్ని రోజుల ముందు విడుదలైన సెకండ్‌ ట్రైలర్‌ కూడా రికార్డులు క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు 100 మిలియన్లకుపై వ్యూస్‌ సొంతం చేసుకుంది.

ఇక, ప్రీ బుకింగ్స్‌ విషయంలో సలార్‌ రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేసింది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో భారీ స్థాయిలో బిజినెస్‌ జరిగింది. తెలుగు నాట మాత్రం ప్రీ బుకింగ్స్‌ సలార్‌ విడుదలకు రెండు రోజుల ముందు మొదలయ్యాయి. పెరిగిన ధరలతో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని చోట్ల సలార్‌ బెనిఫిట్‌ షోలు కూడా పడ్డాయి. సలార్‌ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అయిందని తెలియగానే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పండుగ చేసుకున్నారు. 5 ఏళ్ల ఎదురుచూపుకు భారీ బహుమానం దక్కిందని సంతోషించారు.

ఇక, సలార్‌ సినిమాకు డంకీ పోటీ వస్తుందని అందరూ భావించారు. సలార్‌ కంటే ఒక రోజు ముందు డంకీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమా బాగున్నా .. సలార్‌ దెబ్బకు డంకీ వెనక్కు పడిపోయింది. ఇప్పుడు నార్త్‌లో కూడా సలార్‌ హవానే నడుస్తోంది. డంకీ సినిమా తీసేసి సలార్‌ సినిమాలు వేస్తున్నారు. మరి, సలార్‌ ఫస్ట్‌ డే కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş