iDreamPost
android-app
ios-app

సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? ఇదీ సలారోడి స్టామినా

  • Published Dec 22, 2023 | 8:33 PM Updated Updated Dec 22, 2023 | 8:33 PM

Salaar Movie First Day Collections: సలార్ సినిమా రిలీజ్ ముందు నుంచీ రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా సలారోడు మరిన్ని రికార్డులను బద్దులు కొట్టేందుకు రెడీ అయిపోయాడు.

Salaar Movie First Day Collections: సలార్ సినిమా రిలీజ్ ముందు నుంచీ రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా సలారోడు మరిన్ని రికార్డులను బద్దులు కొట్టేందుకు రెడీ అయిపోయాడు.

  • Published Dec 22, 2023 | 8:33 PMUpdated Dec 22, 2023 | 8:33 PM
సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? ఇదీ సలారోడి స్టామినా

సలార్.. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఈ పేరు మారుమోగుతోంది. ఎక్కడ చూసినా సలార్- ప్రభాస్- ప్రశాంత్ నీల్ గురించే చర్చలు జరుగుతున్నాయి. అటు బాలీవుడ్ లో కూడా సలార్ బాక్సాఫీస్ కి చెమటలు పట్టిస్తున్నాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత తమ ఆకలి తీరిదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు అందరూ సలార్ మేనియాలో ఉన్నారు. సలారోడి బాక్సాఫీసు వేట ఆల్రెడీ మొదలైపోయింది. డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ప్రభాస్ బద్దలు కొట్టే రికార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా సలార్ ఫస్ట్ డేలోనే ఈ ఏడాది రికార్డులన్నీ బద్దలు కొట్టిందని చెబుతున్నారు.

నిజానికి సలార్ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం మొదలుపెట్టి చాలారోజులు అయ్యింది. అటు ట్రైలర్లతో యూట్యూబ్ రికార్డులనే కాకుండా… తొలిరోజు అత్యధిక టికెట్స్ అమ్ముడైన(30 లక్షలకు పైగా) ఇండియన్ సినిమాగా రికార్డులు తిరగరాసింది. అటు నార్త్ అమెరికా ప్రీమియర్ గ్రాస్ కలెక్షన్స్ 2.6 మిలియన్స్ దాటిపోయింది. ఈ రికార్డులకే డార్లింగ్ ఫ్యాన్స్ ఇది సార్ మా సలారోడి రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు సిసలైన రికార్డు ఒకటి రాబోతోంది. అదేంటంటే సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్. అందరూ ఇప్పటివరకు సలార్ తొలిరోజు రూ.150 కోట్లు గ్రాస్ రాబడుతుంది అనుకున్నారు. ఇంకొంతమంది అది అంత ఈజీ కాదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ప్రభాస్ క్రేజ్, స్టామినా, రేంజ్ ముందు ఆ రూ.150 కోట్లు అస్సలు లెక్కేకాదనే విషయం రుజువైంది.

సలార్ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.175 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు ఇప్పటికే ఒక అంచనాకి వచ్చేశారు. ఈ రూ.175 కోట్లలో రూ.60 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి వచ్చినవే ఉన్నాయి. అయితే అధికారిక లెక్కలు, అసలు సిసలైన అంకెలు తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు ఆగాల్సి ఉంటుంది. కానీ, ప్రభాస్ సినిమా మీద క్రేజ్ ని బట్టి పండితులు ఇప్పటికే ఒక అంచనాకి వచ్చేశారు. అంతేకాకుండా ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో అత్యధిక ఫస్ట్ డే గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా సలార్ నిలుస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఆదివారం వరకు దాదాపు అన్ని థియేటర్లలో టికెట్స్ బుక్ అయిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నార్త్ లో కూడా సలార్ సినిమాకి మరిన్ని స్క్రీన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సలార సినిమా లాంగ్ రన్ లో పాన్ ఇండియా సినిమాల పేరిట ఉన్న ఎన్నో రికార్డులను బద్దలు కొడుతుందని చెబుతున్నారు. ఇంక ఈ వార్తలు తెలిసిన తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది సార్ డార్లింగ్ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక సినిమా అయితే ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మరి.. సలార్ సినిమా ఫస్ట్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom