Venkateswarlu
డంకీ మూవీ సలార్ మూవీ కంటే ఒకరోజు ముందే థియేటర్లలోకి వచ్చింది. డంకీ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, రికార్డుల విషయంలో సలార్‌ను బీట్ చేసే దమ్ము డంకీ లేదని స్పష్టం అవుతోంది.
డంకీ మూవీ సలార్ మూవీ కంటే ఒకరోజు ముందే థియేటర్లలోకి వచ్చింది. డంకీ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, రికార్డుల విషయంలో సలార్‌ను బీట్ చేసే దమ్ము డంకీ లేదని స్పష్టం అవుతోంది.
Venkateswarlu
భారీ అంచనాల నడుమ విడుదలైన సలార్ సినిమాకు దేశ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో సలార్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు ఈ సినిమాకు 150 కోట్ల పైగా కలెక్షన్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సలార్‌కు ప్రత్యర్థిగా భావించిన డంకీ అసలు పోటీలో కూడా లేకుండా పోతుందని తేలింది. డంకీ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డంకీ విడుదలకు ముందు నుంచి సలార్‌తో పోటీ పడుతుందని అందరూ అనుకున్నారు. సలార్ కలెక్షన్ల విషయంలోనూ డంకీ దెబ్బ పడుతుందని భావించారు. అయితే, సలార్ థియేటర్లలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. డైనోసార్ వేటకు డంకీ బలికాక తప్పటం లేదు. ప్రీ బుకింగ్స్ విషయంలోనే కాదు.. రాబోయే రోజుల్లో కలెక్షన్ల విషయంలోనూ డంకీ.. సలార్‌కు ఏ మాత్రం పోటీ కాదని తేలిపోయింది. సలార్ కన్ను మొత్తం జవాన్ రికార్డులపై పడనుంది.
షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వం తెరకెక్కిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు మిగిలిన భాషల్లో కూడా విడుదల అయింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు 1148 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 2023 సంవత్సరానికి గాను హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. అయితే, ఈ రికార్డులను సలార్ తుడిచి పెట్టే అవకాశం ఉంది. సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది 2023లోనే కాబట్టి..
సినిమా థియేటర్లలోంచి బయటకు వచ్చేలోగా 1148 కోట్లకు మించి కలెక్షన్లు సాధిస్తే.. జవాన్ రికార్డు తుడిచి పెట్టుకుపోతుంది. టార్గెట్ 2024లో పూర్తయినా.. సలార్ విడుదలైంది 2023లోనే కాబట్టి.. రికార్డు ఈ సంవత్సరం ఖాతాలోకే వస్తుంది. లేదా.. 2023 సంవత్సరం పూర్తి కావటానికి ఇంకా 8 రోజులు ఉంది. ఈ 8 రోజుల్లోగా సలార్ ఈ రికార్డును బ్రేక్ చేస్తే.. అదో సంచలనం అవుతుంది. కానీ, అంత ఈజీ కాదు.. మొదటి రెండు మూడు రోజులు 15 కోట్ల రూపాయల లెక్కన కలెక్షన్లు వచ్చినా..
నాలుగవ రోజు నుంచి కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది. 8 రోజుల్లో జవాన్ టార్గెట్‌ను బీట్ చేయటం కష్టం అవుతుంది. ఏది ఏమైనప్పటికి సలార్ కన్నుమొత్తం జవాన్ రికార్డులపైనే ఉంది. మరి, సలార్.. జవాన్ రికార్డుని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందని మీరు భావిస్తున్నారు.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.