iDreamPost
android-app
ios-app

సుకుమార్ ను ఫాలో అవుతున్న ప్రశాంత్ నీల్! సలార్ కోసం..

  • Author Soma Sekhar Published - 01:23 PM, Fri - 3 November 23

సలార్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సుకుమార్ ను ఫాలో అవుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

సలార్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఆ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సుకుమార్ ను ఫాలో అవుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

  • Author Soma Sekhar Published - 01:23 PM, Fri - 3 November 23
సుకుమార్ ను ఫాలో అవుతున్న ప్రశాంత్ నీల్! సలార్ కోసం..

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎటు చూసినా.. పాన్ ఇండియా సినిమాలే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఇక పాన్ ఇండియా మూవీల లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం తాను నటించిన సలార్ పార్ట్-1 మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సలార్ కు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ను ఫాలో అయ్యాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ విషయంలో ప్రశాంత్, సుకుమార్ బాటలో పయనిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.

మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ‘సలార్’ అనే సమాధానమే చాలా మంది నుంచి వస్తుంది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్. ఈ క్రమంలో సలార్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మనం కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల్లో చూసే ఉన్నాం.

కాగా.. సలార్ లో అంతకు మించి ఉంటాయని, ప్రభాస్ ను మీరింతకు ముందు చూడని విధంగా చూస్తారని ప్రశాంత్ నీల్ తెలిపాడు. ఇక సలార్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం జీపులు, ట్యాంకులు, ట్రక్కులు సహా 750కి పైగా వాహనాలను ఉపయోగించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని కన్నడ మీడియాతో చిత్ర యూనిట్ పంచుకుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈ యాక్షన్ సీన్ ఉంటుదట. ఇందుకోసం ఓ భారీ యుద్దభూమినే నిర్మించారు. ఇక ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్.. షాక్ కు గురవుతున్నారు. మరికొందరు మాత్రం ప్రశాంత్ నీల్ టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ను ఫాలో అవుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకుంటే?

సుకుమార్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న పుష్ప 2లో యాక్షన్ సీక్వెన్స్ కోసం.. వందల సంఖ్యలో లారీలను ఉపయోగిస్తున్నా వీడియో కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. సలార్ పార్ట్-2 విడుదల తేదీని పార్ట్-1 విడుదల అయిన వెంటనే ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్ట్-2ని ఏప్రిల్ 2024 వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యిందని, పొస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని సమాచారం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss