iDreamPost
android-app
ios-app

బాక్సాఫీస్ వద్ద తగ్గని సలారోడి జోరు.. ఏకంగా రూ.500 కోట్ల క్లబ్ లో

  • Published Dec 28, 2023 | 5:19 PM Updated Updated Dec 28, 2023 | 5:19 PM

Salaar Running Towards Break-Even: ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ సినిమాకు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేకవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది.

Salaar Running Towards Break-Even: ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ సినిమాకు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేకవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది.

  • Published Dec 28, 2023 | 5:19 PMUpdated Dec 28, 2023 | 5:19 PM
బాక్సాఫీస్ వద్ద తగ్గని సలారోడి జోరు.. ఏకంగా రూ.500 కోట్ల క్లబ్ లో

సలార్ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న టాపిక్. ఎక్కడ చూసినా సినిమా లవర్స్ ఈ మూవీ గురించే తెగ చర్చించేసుకుంటున్నారు. సలార్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చాలానే ఉన్నాయి. కానీ, ఈ సలార్ మాత్రం అభిమానులకు ఎంతో ప్రత్యేకం అయిపోయింది. ఎందుకంటే ప్రభాస్ నుంచి వచ్చిన గత చిత్రాలు ఆడియన్స్ ని మాత్రమే కాకుండా అభిమానులను కూడా నిరుత్సాహ పరిచాయి. అలాంటి సమయంలో ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమా చూసి ఫ్యాన్స్, మూవీ లవర్స్ అంతా ఫుల్ పండగ చేసుకుంటున్నారు. ఇంక బాక్సాఫీస్ వద్ద సలారోడి వేట గురించి చెప్పనక్కర్లేదు. కలెక్షన్స్ లో కోట్లు అనేవి సలార్ కి చిన్న అంకెలా మారిపోయింది.

సలార్ సినిమాకి స్పెషల్ షో నుంచే పాజిటివ్ టాక్ స్టార్ట్ అయిపోయింది. నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ ని ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా రిపీటెడ్ ఆడియన్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వరల్డ్ వైడ్ గా సలార్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. యూఎస్, ఆస్ట్రేలియాలో కూడా రికార్డుల క్రియేట్ చేస్తోంది. ఇంక ఇండియాలో అయితే ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ బాద్షా డంకీ సినిమా కూడా సైడ్ అయిపోవాల్సి వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.500 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాస్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ వైపు అడుగులు వేస్తోంది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మేకర్స్ కూడా ఈ మూవీ రూ.వెయ్యి కలెక్ట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ ఖాతాలో బాహుబలి-2 రూ.వెయ్యి కోట్లకుపైగా కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సలార్ కూడా రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తే డార్లిగ్ కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అవుతుంది.

ఇప్పటికే రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన సలార్ సినిమా ఇంకో రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది. సలార్ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది. అదే ఊపులో ఇంకో రూ.100 కోట్లు పూర్తి చేస్తే.. బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతడి బిగ్ బడ్జెట్, బిగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా ఇంత తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా ఒక రికార్డే అవుతుంది. అది కూడా సలార్ సినిమాకి నార్త్ లో డంకీ వల్ల తక్కువ స్క్రీన్స్ దక్కిన సంగతి తెలిసిందే. ఇలాంటి అడ్డంకులతో కూడా సలార్ బాక్సాఫీస్ వద్ద విజృభిస్తోంది. ఇంక ప్రభాస్ కెరీర్ లో నెక్ట్స్ రాబోయేవి కూడా భారీ చిత్రాలే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ, మారుతీ దర్శకత్వంలో రాజా డీలక్స్ చేస్తున్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం చేయనున్నాడు. ఈ లిస్ట్ చూస్తుంటేనే ప్రభాస్ అభిమానుల్లో క్రేజ్ రెట్టింపు అవుతోంది. మరి.. సలార్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş