iDreamPost
android-app
ios-app

కొనసాగుతున్న సలార్‌ మానియా.. దరిదాపుల్లో కూడా లేని ‘డంకీ’..

డంకీ, సలార్‌ సినిమాలు ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డంకీ డిసెంబర్‌ 21వ తేదీన, సలార్‌ డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

డంకీ, సలార్‌ సినిమాలు ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డంకీ డిసెంబర్‌ 21వ తేదీన, సలార్‌ డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

కొనసాగుతున్న సలార్‌ మానియా.. దరిదాపుల్లో కూడా లేని ‘డంకీ’..

ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సలార్‌ మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ప్రతీ విషయంలోనూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా కలెక్షన్ల విషయంలో ప్రత్యర్థి సినిమా డంకీని పోటీలో కూడా లేకుండా చేసింది. సలార్‌ డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఏకంగా 178 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. రెండవ రోజు 120 కోట్లు మూడవ రోజు 80 కోట్లు కలెక్ట్‌ చేసింది. నాలుగు రోజుల్లో 400 కోట్ల మార్కును చేరుకుంది.

అయితే, డంకీ మాత్రం నాలుగు రోజుల్లో కేవలం 215 కోట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇప్పుడు టికెట్‌ బుకింగ్స్‌ విషయంలోనూ సలార్‌దే పై చెయ్యి నడుస్తోంది. ప్రీ బుకింగ్స్‌ విషయంలో డంకీ పై చెయ్యి నడిచింది. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాతినుంచి బుకింగ్స్‌ తగ్గుతూ వచ్చాయి. కానీ, సలార్‌ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ప్రీ బుకింగ్స్‌ డంకీ కంటే తక్కువగా జరిగాయి. సినిమా విడుదల అయిన తర్వాతినుంచి పెరుగుతూ పోయాయి. డంకీ కంటే డబుల్‌, త్రిబుల్‌ బుకింగ్స్‌ జరుగుతూ ఉన్నాయి.

  • 15-12-2023
    సలార్‌ : 22 వేలు
  • 16-12-2023
    డంకీ : 28 వేలు
    సలార్‌ : 39 వేలు
  • 17-12-2023
    డంకీ : 77 వేలు
    సలార్‌ : 60 వేలు
  • 18-12-2023
    డంకీ : 96 వేలు
    సలార్‌ : 82 వేలు
  • 19-12-2023
    డంకీ : 120 వేలు
    సలార్‌ : 224 వేలు
  • 20-12-2023
    డంకీ : 211 వేలు
    సలార్‌ : 690 వేలు
  • 21-12-2023
    డంకీ : 379 వేలు
    సలార్‌ : 662 వేలు
  • 22-12-2023
    డంకీ : 325 వేలు
    సలార్‌ : 926 వేలు
  • 23-12-2023
    డంకీ : 394.03 వేలు
    సలార్‌ : 830 వేలు
  • 24-12-2023
    డంకీ : 409 వేలు
    సలార్‌ : 791 వేలు
  • 25-12-2023
    డంకీ : 282 వేలు
    సలార్‌ : 573 వేలు
  • 26-12-2023
    డంకీ : 190 వేలు
    సలార్‌ : 375 వేలు

కలెక్షన్ల పరంగా డంకీకి నార్త్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. సలార్‌కు నార్త్‌లో తక్కువ థియేటర్లు దక్కాయి. ఇందుకు డంకీ టీమ్‌ కారణం అన్న చర్చ కూడా నడుస్తోంది. అయినప్పటికి సలార్‌ నార్త్‌లో కూడా మంచి వసూళ్లను సాధిస్తోంది. సలార్‌కు వస్తున్న స్పందన చూసి థియేటర్ల యజమాన్యం డంకీ సినిమా తీసేసి సలార్‌ వేసుకుంటున్నారు. నార్త్‌ ప్రేక్షకులు కూడా సలార్‌కే ఓటు వేస్తున్నారు. ఫ్యామిలీని తీసుకుని మరీ వెళుతున్నారు.

కాగా, సలార్‌.. ప్రశాంత్‌ నీల్‌ మొదటి చిత్రం ‘ ఉగ్రం’ రీటెల్‌గా తెరకెక్కింది. 2014లో విడుదలైన ఈ మూవీ కథను ప్రభాస్‌కు తగ్గటు మార్పులు చేసి సలార్‌గా తీశాడు. ఈ విషయం గురించి విడుదలకు ముందే ప్రేక్షకులకు చెప్పాడు. తన కథను అనుకున్నంత న్యాయం చేయాలన్న ఉద్ధేశ్యంతోనే ఈ విధంగా చేసినట్లు తెలిపాడు. మరి, బుకింగ్స్‌ విషయంలో సలార్‌.. డంకీని వెనక్కు నెట్టేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.