iDreamPost
android-app
ios-app

Salaar 2: సలార్‌ 2 షూటింగ్‌ మొదలయ్యేది ఎప్పుడంటే.. అడ్డుగా ఆ సినిమాలు!

  • Published Dec 23, 2023 | 4:59 PM Updated Updated Dec 23, 2023 | 4:59 PM

సలార్‌ : సీజ్‌ ఫైర్‌ సాధించిన విజయంతో సలార్‌ : శౌర్యాంగ పర్వంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలు కానుందనే దానిపై క్లారిటీ లేదు.

సలార్‌ : సీజ్‌ ఫైర్‌ సాధించిన విజయంతో సలార్‌ : శౌర్యాంగ పర్వంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలు కానుందనే దానిపై క్లారిటీ లేదు.

  • Published Dec 23, 2023 | 4:59 PMUpdated Dec 23, 2023 | 4:59 PM
Salaar 2: సలార్‌ 2 షూటింగ్‌ మొదలయ్యేది ఎప్పుడంటే.. అడ్డుగా ఆ సినిమాలు!

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ 5 ఏళ్ల నిరీక్షణకు ‘సలార్‌’ రూపంలో ఓ మంచి ప్రతి ఫలం దక్కింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. విడుదల అయిన  అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొదటి నుంచి రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తున్న సలార్‌.. మొదటి రోజు కలెక్షన్ల విషయంలో అంచనాలను మించి పోయింది. మూవీ మొదటి రోజు 150 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావించారు.

అయితే, వారి అంచనాలను తుడిచిపెట్టేస్తూ.. ఏకంగా 178 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ లెక్కన సలార్‌ 2023లోనే 1000 కోట్ల మార్కునే చేరేలాగా కనిపిస్తోంది. సలార్‌ సాధించిన ఈ విజయంతో.. సలార్‌ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్‌ 2 చరిత్ర సృష్టిస్తుందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు నమ్ముతున్నాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి సలార్‌ 2పైకి మళ్లింది. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మొదలు కానుంది? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది అన్న ఆలోచనల్లో పడిపోయారు. సోషల్‌ మీడియాలో దీనిపై వెతుకులాట మొదలుపెట్టారు.

సలార్‌ 2 షూటింగ్‌ ఇప్పట్లో లేనట్లే.. 

సలార్‌ మొదటి భాగం ‘సీజ్‌ ఫైర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో భాగం సలార్‌ : శౌర్యాంగ పర్వంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ రెండో భాగం షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న దానిపై కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే.. ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కల్కీ మూవీతో పాటు మారుతీతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండూ షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలకు కూడా ప్రభాస్‌ సైన్‌ చేశారు.

వీటి షూటింగ్లు పూర్తయిన తర్వాతే సలార్‌ 2 కోసం సమయం కేటాయించే అవకాశం ఉంది. మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ఇప్పుడు రెస్ట్‌ తర్వాత ఆ మూవీ కోసం పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. ప్రశాంత్‌.. యశ్‌తో కేజీఎఫ్‌ 3 కూడా కమిట్‌ అయ్యారు. దీని తర్వాత సలార్‌ 2 షూటింగ్‌ మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏం జరగబోతోందో తెలియాలంటే.. కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

కాగా, సలార్‌ 2 సినిమా గురించి కేజీఎఫ్‌ ఫేమ్‌ గరుడ రామ్‌ మాట్లాడుతూ.. ‘‘ నేను సలార్‌ 1.. సలార్‌ 2లో కూడా ఉంటాను. సలార్‌ 2 గురించి ప్రశాంత్‌ ఏమీ చెప్పలేదు. ఎప్పుడు షూటింగ్‌ ఉంటుందో కూడా చెప్పలేదు. ఆయన రమ్మన్నపుడు వెళ్లాలి’’ అని అన్నారు. దీన్ని బట్టే తెలుస్తుంది.. షూటింగ్‌ ఇప్పట్లో ఉండదని. మరి, సలార్‌ 2పై మీ అంచనాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom