iDreamPost
android-app
ios-app

త్వరలో సెట్స్‌పైకి సలార్‌ 2.. డైనోసార్‌ ఈజ్‌ బ్యాక్‌!

  • Published Jan 18, 2024 | 9:08 PM Updated Updated Jan 18, 2024 | 9:08 PM

మొన్న సలార్‌ మూవీ సక్సెస్‌ పార్టీ జరిగింది. సినిమా టీం మొత్త బ్లాక్‌ డ్రెస్సులో దర్శనమిచ్చారు. హీరో ప్రభాస్‌ ఓ కొత్త లుక్‌లో కనిపించారు. ఆ లుక్‌పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

మొన్న సలార్‌ మూవీ సక్సెస్‌ పార్టీ జరిగింది. సినిమా టీం మొత్త బ్లాక్‌ డ్రెస్సులో దర్శనమిచ్చారు. హీరో ప్రభాస్‌ ఓ కొత్త లుక్‌లో కనిపించారు. ఆ లుక్‌పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

  • Published Jan 18, 2024 | 9:08 PMUpdated Jan 18, 2024 | 9:08 PM
త్వరలో సెట్స్‌పైకి సలార్‌ 2.. డైనోసార్‌ ఈజ్‌ బ్యాక్‌!

ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌ ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. విడుదలైన అన్ని భాషల్లో చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ మొదటి రోజు ‍ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 178 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు 700 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది.

ఇక, సలార్‌ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నదన్న సంగతి తెలిసిందే. మొదటి భాగానికి సీజ్‌ ఫైర్‌ అని పేరు పెట్టగా.. రెండో భాగానికి శౌర్యాంగ పర్వం అని పేరు పెట్టారు. శౌర్యాంగ పర్వం షూటింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకైతే ఎలాంటి అఫిషియల్‌ అప్‌డేట్‌ రాలేదు. కానీ, నిన్నటి నుంచి ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న న్యూస్‌ ప్రకారం.. ప్రశాంత్‌ నీల్‌ శౌర్యాంగ పర్వం ప్రీప్రొడక్షన్‌ పనులు పూర్తి చేశారు.

అతి త్వరలో షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. మొన్న జరిగిన సలార్‌ సక్సెస్‌ మీట్‌లో ప్రభాస్‌ కనిపించిన లుక్‌.. సలార్‌ 2 : శౌర్యాంగ పర్వం కోసమేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. వేచి చూడాల్సిందే. కాగా, ప్రశాంత్‌ నీల్‌ గతంలో తాను తీసిన ‘ ఉగ్రం’ అనే కన్నడ సినిమాను సలార్‌గా రీమేక్‌ చేశారు. ఉగ్రం సినిమా 2014లో విడుదలైంది. ఇందులో ప్రశాంత్‌ బావ శ్రీమురళి హీరోగా నటించారు.

బొమ్మ బ్లాక్‌ బాస్టర్‌ అయింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే, తన కథకు తాను అనుకున్నంత స్పందన రాలేదని ప్రశాంత్‌ భావించారు. కేజీఎఫ్‌ చిత్రాలు సాధించిన విజయం తర్వాత .. ఉగ్రం కథపై దృష్టి పెట్టారు. కథలో చాలా మార్పులు చేశారు. కథను ప్రభాస్‌కు తగ్గట్టుగా మార్చారు. సలార్‌గా తీస్తున్నారు. ఇప్పుడు రెండు భాగాలుగా కథ తయారైంది. పైగా కాన్సార్‌ అనే ఓ ప్రపంచాన్ని కూడా సలార్‌ కోసం ప్రశాంత్‌ సృష్టించారు. మరి, సలార్‌ 2 : శౌర్యాంగ పర్వం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందన్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetist