iDreamPost
android-app
ios-app

Sailesh Kolanu: వెంకటేష్ లడ్డులా దొరికారు

  • Published Jan 02, 2024 | 1:09 PM Updated Updated Jan 02, 2024 | 1:11 PM

విక్టరీ వెంకటేశ్‌ నటించిన సైంధవ్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే టీజర్‌, పాట అందరిని ఆకట్టుకున్నాయి. అయతే.. ఈ సినిమా దర్శకుడు శైలేష్‌.. వెంకటేశ్‌ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ గురించి మాట్లాడారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

విక్టరీ వెంకటేశ్‌ నటించిన సైంధవ్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే టీజర్‌, పాట అందరిని ఆకట్టుకున్నాయి. అయతే.. ఈ సినిమా దర్శకుడు శైలేష్‌.. వెంకటేశ్‌ను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ గురించి మాట్లాడారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 02, 2024 | 1:09 PMUpdated Jan 02, 2024 | 1:11 PM
Sailesh Kolanu: వెంకటేష్ లడ్డులా దొరికారు

దర్శకుడిగా శైలేష్ కొలను బోలెడు సినిమాలు చెయ్యలేదు గానీ, చేసిన ఆ రెండు మూడు సినిమాలే దర్శకుడిగా శైలేష్ కి ఓ సెపరేట్ స్టైల్‌ని తీసుకొచ్చాయి. అదెంతవరకూ వెళ్ళిందంటే విక్టరీ వెంకటేష్ లాటి హీరో.. అంటే అంత అనుభవం.. హిట్ వచ్చింది కదా ఓ డైరెక్టర్ వెనుక పడే అలవాటు లేని, కేవలం మెరిట్ ని మాత్రమే నమ్మి ఎందరికో అవకాశాలు కల్పించిన సంస్థ ఆవరణలోనే పరిగెత్తి పాలు తాగడానికి ప్రయత్నించకుండా, నిలబడే నీళ్ళు తాగుతూ, 75 సినిమాల జైత్రయాత్రను జరుపుకుంటున్న ఓ సంప్రదాయబద్ధమైన హీరో వెంకటేష్ శైలేష్ కొలనుని దర్శకుడిగా ఎంచుకున్నాడంటే అక్కడే శైలేష్కి నూటికి నూరు మార్కలు పడ్డాయి. తర్వాతే సైంధవ సినిమా కథా చర్చలు ప్రారంభమయ్యాయి.

మరి ఏం చెప్పి ఒప్పించాడబ్బా వెంకటేష్ ని? అందరి మదిలో ఇదే తొలిచే ప్రశ్న. ఎందరో ఎప్పట్నుంచో లైన్ లో ఉండి ఉంటారు కదా. వాళ్ళందరినీ తోసుకు ముందుకు వచ్చేశాడంటే.. ఆ క్యులో అందరికీ అడ్డుపడిన సైందవుడు శైలేష్ కొలనే. వెంకటేస్ వీర కాన్ఫిడెంట్ గా ఉండడం సైంధవ సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ ని ఎక్కువగా తెచ్చింది. పైగా మొన్నీ మధ్య రిలీజ్ చేసిన పాట బుచ్చికొండవే.. సెంటిమెంట్ ను నింపి అందరి కళ్ళూ చెమర్చే విధంగా ఆకట్టుకుంది. మొదటి ట్రైలర్ సినిమా యాక్షన్ ప్లస్ ఎమోషన్ ని బాగా మాస్ లోకి క్యారీ చేసింది. ఇప్పుడీ పాట. దీని గురించే డైరెక్టర్ శైలేష్ ఐ డ్రీమ్ పోస్ట్ తో మాట్లాడుతూ.. తాను కలలో కూడా ఊహించలేదని, వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం ఇంత త్వరగా లభిస్తుందని అనుకోలేదని చెప్పాడు.

saindav director sailesh kolanu

ఏదో రెండు సినిమాలు అడవి శేషు, విష్వక్సేన్ వాళ్ళతో చేసిన తనకు వెంకటేష్ తో చేయడం నిజంగా పెద్ద ఎఛీవ్మెంట్ గానే అనుకుంటున్నట్టుగా చెప్పాడు. నిజానికి హాలీవుడ్లో తన లాంటి యంగ్ డైరెక్టర్స్ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని, కానీ తెలుగులో కూడా అలాటి అవకాశాలొస్తే ఎంతో బాగుంటుందని తాను అనుకునేవాడినని, ఆ అవకాశం ఇఫ్పుడు సైంధవ్ రూపంలో హీరో వెంకటేస్ కల్పించారని శైలేష్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నిజంగా తనకి వెంకటేష్ లడ్డులా దొరికాడని కూడా వ్యాఖ్యానించాడు. 2024 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కాబోతోంది సైంధవ. రేపు, జనవరి 3వ తేదీన ట్రైలర్ విడుదల కాబోతోంది. మరి వెంకటేశ్‌ లాంటి పెద్ద హీరో యంగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ సినిమా చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş