Venkateswarlu
వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ విడుదలకు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో.. చిత్ర దర్శకుడు శైలేష్ స్పందించారు.
వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ విడుదలకు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో.. చిత్ర దర్శకుడు శైలేష్ స్పందించారు.
Venkateswarlu
విక్టరీ వెంకటేష్ – శైలెష్ కొలను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సైంధవ్’ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యాక్షన్ ప్యాక్డ్ ప్లస్ సెంటిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఇక, సైంధవ్ సినిమా విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో దర్శకుడు శైలేష్ కొలను స్పందించారు. సైంధవ్ మూవీ గురించి తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఆ పోస్టులో.. ‘‘ చివరి కాపీలను ఇప్పుడే డెలివరీ చేశాం. సైంధవ్ ఇప్పుడు మీది. నేను మీకు ఓ విషయం చెప్పుదల్చుకున్నాను. అది కూడా మానవత్వం, సభ్యతతో.. సైంధవ్‌లోని చివరి 20 నిమిషాలు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌లోనే అత్యద్భుతమైన విధంగా ఉంటుంది. అది కూడా వెంకీమామ కారణంగానే.. ఆయనతో కలిసి పని చేసినందుకు, అద్భుతమైన నటనను కెమెరాలో బంధించినందుకు నాకు సంతోషంగా ఉంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో.. 13వ తేదీ చూస్తారు. థియేటర్లలో కలుద్దాం’’ అని పేర్కొన్నారు.
కాగా, ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. రుహానీ శర్మ, ఆర్య, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మయ్యా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. మొన్న విడుదల అయిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. సినిమాలోని పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. సైంధవ్‌లో వెంకటేష్ అండర్ వరల్డ్ డాన్‌గా కనిపించనున్నాడే టాక్ నడుస్తోంది.
ట్రైలర్‌ను బట్టి చూస్తే.. కూతురి కోసం వెంకీమామ నేర సామ్రాజ్యాన్ని వదులుకుంటాడు. సామాన్య వ్యక్తిలా బతుకుతూ ఉంటాడు. ఏ కూతురి కోసం అన్నీ వదిలేసుకుంటాడో.. ఆ కూతురే ప్రమాదంలో పడుతుంది. పాప ఓ అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. పాపను రక్షించుకోవటానికి కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అలాంటి సమయంలో వెంకీ ప్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. మళ్లీ నేర సామ్రాజ్యం వైపు వెళతాడు. ఇంతకీ అతడి ప్లాష్ బ్యాక్ ఏంటి? కూతురి కోసం నేర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన తర్వాత ఏమవుతుంది? కూతుర్ని బతికించుకుంటాడా? లేదా? అన్నదే మిగిలిన కథ. మరి, సైంధవ్ సినిమాపై శైలేష్ కొలను చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.