iDreamPost
android-app
ios-app

ఆ సినిమా వదులుకొని మంచి పని.. లేదంటే బలి అయ్యేదే!

  • Author ajaykrishna Updated - 03:43 PM, Wed - 6 September 23
  • Author ajaykrishna Updated - 03:43 PM, Wed - 6 September 23
ఆ సినిమా వదులుకొని మంచి పని.. లేదంటే బలి అయ్యేదే!

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఎంత సెలక్టెడ్ గా సినిమాలు చేస్తుందో తెలిసిందే. ఆమె చేసే ఒక్కో సినిమా.. అంతకంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గేదేలే అనిపించుకుంటున్నాయి. తన సహజమైన నటనతో నేచురల్ బ్యూటీగా పేరొందిన పల్లవి.. తెలుగులో సినిమా చేసి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా.. ఇంతవరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. సాయి పల్లవి కొత్త సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తుందా? అని ఫ్యాన్స్ మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా సాయి పల్లవి స్టార్డమ్ మెయింటైన్ చేస్తోంది.

మామూలుగా స్టార్ హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వస్తాయని అంటుంటారు. కానీ.. సాయి పల్లవి ఏ సినిమాలో నటించినా.. ఆమె పేరు మీదనే ఓపెనింగ్స్ అదిరిపోతుంటాయి. ఆ స్థాయి క్రేజ్ సాయి పల్లవిది. అయితే.. కెరీర్ లో హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా మంచి కథకు, తన పాత్ర పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న సబ్జెక్టులు ఎంచుకుంటుంది పల్లవి. ఆమె చేసిన సినిమాలు ప్లాప్ అవుతాయేమో గానీ.. ఆమె పెర్ఫార్మన్స్ కి మాత్రం ఎప్పుడు విమర్శలు రాలేదు. ఇంకో విషయం ఏంటంటే.. సాయిపల్లవి రీమేక్ సినిమాలకు, సీక్వెల్స్ కి చాలా దూరంగా ఉంటుంది. ఎందుకోగాని ముందునుండి అదే పాలసీ ఫాలో అవుతోంది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ తో భోళా శంకర్ సినిమా వదులుకుంది. మరోవైపు సూపర్ స్టార్ రజినీ నటించిన చంద్రముఖి సీక్వెల్ కి కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రముఖి 2.. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమాలో చంద్రముఖి క్యారెక్టర్ కోసం ముందుగా సాయిపల్లవిని సంప్రదించారట మేకర్స్. కానీ.. ఆ పాత్రలకు సౌందర్య, జ్యోతిక స్థాయిలో తాను న్యాయం చేయలేనని, ఒకవేళ ఒప్పుకొని చేసినా.. వాళ్లతో పోల్చి చర్చలు, రాద్ధాంతాలు చేస్తారని నో చెప్పేసిందని సమాచారం. అవును.. చంద్రముఖి 2 ఫలితం ఏదైనా కంగనాకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ.. సాయిపల్లవి చేసిందంటే ఆ అటెన్షన్ వేరుంటుంది. పైగా సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆ పాత్రలను పోల్చి ట్రోల్ చేసేవారు రెడీగా ఉంటారు. కాబట్టి.. సాయి పల్లవి నో చెప్పి మంచి పని చేసిందని, లేదంటే ట్రోల్స్ కి బలి అయ్యేదని అంటున్నారు. మరి సాయి పల్లవి నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş