iDreamPost
android-app
ios-app

అనిరుధ్, లోకేష్ కనగరాజ్ హీరోలుగా సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?

  • Author ajaykrishna Published - 02:30 PM, Tue - 25 July 23
  • Author ajaykrishna Published - 02:30 PM, Tue - 25 July 23
అనిరుధ్, లోకేష్ కనగరాజ్ హీరోలుగా సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?

హీరోలతో సినిమాలు తీసే డైరెక్టర్స్.. కొన్నాళ్ళకు హీరోలుగా మారి సినిమాలు చేయడం చూశాం. ఇంకా చూస్తూనే ఉన్నాం. ముందు కెమెరా వెనుక వర్క్ చేసినవారు కెమెరా ముందు హీరోలుగా ప్రత్యక్షమైతే ఎవరికైనా మొదట్లో ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కానీ.. అలా చేసి సక్సెస్ అయినవారు కూడా ఉన్నారు కదా! సో.. డైరెక్టర్స్ హీరోలుగా మారినా.. మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్టర్స్ గా ఎంట్రీ ఇచ్చినా.. లేదా వేరే ఎవరైనా టెక్నీషియన్ కెమెరా ముందుకు వచ్చినా ఫ్యాన్స్ కి మాత్రం సంతోషమే. ఎందుకంటే.. ఫ్యాన్స్, ప్రేక్షకులే ఎవరు ఎలా వచ్చినా.. సినిమాలు కరెక్ట్ గా ఉంటే ఆదరించడానికి రెడీగా ఉంటారు. అయితే.. త్వరలోనే ఓ క్రేజీ కాంబినేషన్ హీరోలుగా తెరపై డెబ్యూ చేయబోతున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది.

ఆ క్రేజీ కాంబినేషన్ ఎవరో కాదు.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ – మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. అదేంటి వీళ్ళు హీరోలేంటి.. వీళ్ళే ఆల్రెడీ మాస్టర్, విక్రమ్.. లియో సినిమాలు చేస్తున్నారు కదా అనిపించవచ్చు. అవును.. వీళ్ళే విజయ్, కమల్ హాసన్ లాంటి వాళ్లకు బెస్ట్ మూవీస్ ఇస్తున్నారు. ఒకరు డైరెక్టర్ గా వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతుంటే.. ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అలా ఎవరి వర్క్ పరంగా వారు సినీ ఇండస్ట్రీలో తమ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్.. సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న డైరెక్టర్ లోకేష్.. త్వరలోనే దళపతి విజయ్ తో తెరకెక్కించిన లియో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

ఓవైపు ఇదే డైరెక్టర్ లోకేష్ సినిమాలకు వరుసగా మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్.. మరోవైపు పాన్ ఇండియా రేంజ్ సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అయితే.. వీరిద్దరిని హీరోలుగా పరిచయం చేసేందుకు ఇద్దరు స్టంట్ డైరెక్టర్స్ రెడీ అయిపోతున్నారట. పాపులర్ యాక్షన్ డైరెక్టర్స్ అన్బు-అరివు గురించి వినే ఉంటారు. కేజీఎఫ్, సలార్, విక్రమ్ లాంటి బిగ్గెస్ట్ సినిమాలకు స్టంట్ డైరెక్టర్స్ గా వర్క్ చేశారు. అయితే.. వీరిద్దరూ డైరెక్టర్స్ గా డెబ్యూ చేస్తూ.. లోకేష్ – అనిరుధ్ లను హీరోలుగా పరిచయం చేయనున్నారని కోలీవుడ్ వర్గాలలో రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో గాని అధికారికంగా ఏదైనా క్లారిటీ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు అన్బు-అరివు గతంలో లారెన్స్ హీరోగా దుర్గ అనే మూవీ అనౌన్స్ చేశారు. కానీ.. అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. సో.. అందుకే ఇప్పుడు వీరితో కొత్త సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మరి లోకేష్, అనిరుధ్ లు హీరోలుగా సూట్ అవుతారా లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet