iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి ‘రూల్స్‌ రంజన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..

రూల్స్‌ రంజన్‌ సినిమా అక్టోబర్‌ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్‌ వచ్చింది. త్వరలో రూల్స్‌ రంజన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ అవ్వనుంది.

రూల్స్‌ రంజన్‌ సినిమా అక్టోబర్‌ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్‌ వచ్చింది. త్వరలో రూల్స్‌ రంజన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ అవ్వనుంది.

ఓటీటీలోకి ‘రూల్స్‌ రంజన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడంటే..

 కిరణ్‌ అబ్బవరం-నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నంక్రిష్ణ దర్వకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. రూల్స్‌ రంజన్‌కు సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్‌ నెలలో ఓటీటీలోకి రానుందట. డిసెంబర్‌ 1న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవ్వనుందట. రూల్స్‌ రంజన్‌ సినిమా థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇక, రూల్స్‌ రంజన్‌ సినిమా ఫలితాలు ఎలా ఉన్నా.. అందులోని ఓ పాట తెలుగునాట పిచ్చ పాపులర్‌ అయింది. సమ్మోహనుడా.. అన్న పాటకు సోషల్‌ మీడియా బ్రహ్మరథం పట్టింది. ఈ పాట ద్వారానే సినిమాకు చాలా వరకు ప్రమోషన్‌ లభించింది. అయినప్పటికి రూల్స్‌ రంజన్‌ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలం అయ్యాడు. ఓటీటీ విషయంలోనూ రూల్స్‌ రంజన్‌ వెనుకబడిపోయాడు. ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాడు.

కాగా, కిరణ్‌ అ‍బ్బవరం తాజాగా, రెమ్యూనరేషన్‌పై స్పందించారు. ‘‘ నేను నా సినిమాలకు రెమ్యూనరేషన్‌ తీసుకోను.  దానికి బదులు కేవలం లాభాల్లో శాతం మాత్రమే తీసుకుంటాను. ఒక వేళ నా నిర్మాతలు నష్టపోతే.. నేను ఆ సినిమాకు డబ్బులు తీసుకోను. నేను నిర్మాతను అయి ఉంటే.. మీటర్‌, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలను నిర్మించే వాడిని కాదు’’ అని అన్నారు. కిరణ్‌ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందరు హీరోలు కిరణ్‌ను ఫాలో అవ్వాలని నెటిజన్లు అంటున్నారు.

ఇక, కిరణ్‌ అబ్బవరం ఇప్పటి వరకు 8 సినిమాలు చేశారు. వీటిలో ఎక్కువ శాతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 2019లో వచ్చిన ‘రాజా వారు రాణీ వారు’ సినిమాతో హీరోగా మారిన కిరణ్‌.. 2021లో వచ్చిన ‘ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం’ సినిమాతో సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. ఆ తర్వాత 2023లో విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆయన తన షార్ట్‌ ఫిల్మ్‌లనే సినిమాలుగా తీస్తూ వస్తున్నారు.

2017లో ఆయన తీసిన ‘అందరూ అందగత్తెలే’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ ‘‘సమ్మతమే’’ అనే పేరుతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్‌ తీసిన ‘శ్రీకారం’ షార్ట్‌ ఫిల్మ్‌ అదే పేరుతో ‘శ్రీకారం’ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా చేశారు. మరి, రూల్స్‌ రంజన్‌ సినిమా ఆలస్యంగా ఓటీటీలోకి రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.