RRR – 900 కోట్లు నాటౌట్

RRR collections: బాక్సాఫీస్ వద్ద ట్రిపులార్ దూకుడు కంటిన్యూ అవుతోంది. చాలా చోట్ల పది రోజులకే బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడంతో చరణ్ తారక్ అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే 4 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా రాజమౌళి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారని ట్రేడ్ టాక్. కేంద్ర మంత్రి పియుశ్ గోయల్ ఎక్స్ పోర్ట్స్ సక్సెస్ ని 900 కోట్ల కలెక్షన్లు సాధించిన ట్రిపులార్ తో పోల్చడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అంటే మూవీని రాజకీయ వర్గాలు కూడా దీన్ని చూశాయన్న మాట

ఇవాళ నుంచి తెలంగాణ ఏపిలో స్పెషల్ పర్మిషన్ ఇచ్చి పెంచిన టికెట్ రేట్లు తగ్గబోతున్నాయి. సో రేట్లకు భయపడి థియేటర్లకు దూరంగా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంది. పైగా పిల్లల సెలవులు మొదలయ్యాయి. మార్కెట్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇదొక్కటే. సో హౌస్ ఫుల్ బోర్డులు ఇప్పటికిప్పుడు తీసేయాల్సిన అవసరం కనిపించడం లేదు

నార్త్ లోనూ ట్రిపులార్ ప్రభంజనం కొనసాగుతోంది. నిన్న రామ్ చరణ్ ముంబైకు వెళ్లి ప్రఖ్యాత గైటీ థియేటర్ ను సందర్శించారు. అక్కడి క్రౌడ్ చరణ్ ని రిసీవ్ చేసుకున్న తీరు వీడియోల రూపంలో వైరల్ అయ్యింది. వెయ్యి కోట్ల మార్కుకు దగ్గరగా వెళ్తున్న ట్రిపులార్ అది రీచ్ కావడానికి ఎంత టైం తీసుకుంటుందన్నది వేచి చూడాలి. తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ మాత్రం అయిపోయింది.

Show comments