ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన రీతూ చౌదరి? ప్రేమ, పెళ్లి అంటేనే భయపడిపోతూ..!

  • Author singhj Published - 05:11 PM, Sat - 29 July 23
  • Author singhj Published - 05:11 PM, Sat - 29 July 23
ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన రీతూ చౌదరి? ప్రేమ, పెళ్లి అంటేనే భయపడిపోతూ..!

తెలుగు టెలివిజన్ షోల్లో అత్యంత పాపులర్ ప్రోగ్రామ్​గా ‘జబర్దస్త్’ను చెప్పొచ్చు. ప్రముఖ టీవీ ఛానెల్​లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులోని కామెడీ స్కిట్స్​కు ఎవ్వరైనా సరే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. అంతగా ఆడియెన్స్​ను అలరిస్తోందీ షో. ప్రేక్షకులు అంతగా ఆదరిస్తున్నారు కాబట్టే గత కొన్నేళ్లుగా మంచి టీఆర్పీ రేటింగ్స్​తో అదరగొడుతోంది ‘జబర్దస్త్’. ఈ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు పరిచయమై స్టార్ కమెడియన్స్​గా పేరు సంపాదించారు. వారిలో కొందరు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకొని వెండితెర పైనా తమ టాలెంట్ చూపిస్తున్నారు.

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా కొందరు ఫీమేల్ కమెడియన్స్ కూడా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ఒకరు రీతూ చౌదరి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. తన ఫొటో షూట్ పిక్స్​ను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంటూ ఫ్యాన్స్​తో టచ్​లో ఉంటారీ అందాల భామ. అలాగే బుల్లితెరపై పలు షోల్లో కనిపిస్తూ కామెడీ పంచులతో అలరిస్తున్నారు. అలాంటి రీతూ చౌదరి లవ్​లో పడ్డారంటూ ఆ మధ్య ఒక వార్త తెగ వైరల్ అయింది. శ్రీకాంత్ అనే ఓ వ్యక్తితో కలసి తాను దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఈ బంధం కంటే ఏదీ గొప్పది కాదని రీతూ రాసుకొచ్చారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోయారు.

రీతూ చౌదరి నుదుటన శ్రీకాంత్ కిస్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీళ్లిద్దరూ ఏడాది కింద సీక్రెట్​గా పెళ్లి చేసుకున్నారంటూ ఆ మధ్య ఒక ఫొటో కూడా లీకైంది. కానీ దీనిపై రీతూ క్లారిటీ ఇవ్వలేదు. అనంతరం ఏమైందో ఏమో గానీ వీళ్లు మళ్లీ కలసి కనిపించనేలేదు. రీతూ తండ్రి మరణించినప్పుడు కూడా శ్రీకాంత్ ఆమెను ఓదార్చడానికి రాలేదని టాక్. పైగా అతడితో కలసి దిగిన ఫొటోలను రీతూ డిలీట్ చేశారని తెలుస్తోంది. దీంతో అసలు వీళ్లు కలిసే ఉన్నారా? లేదా విడిపోయారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ సందేహాలకు తెరపడింది. ఇన్​స్టాలో ఫ్యాన్స్​తో ‘నిజాలు మాట్లాడుకుందాం’ అంటూ చిట్​చాట్ నిర్వహించారు రీతూ.

అభిమానులతో ఇన్​స్టాగ్రామ్​లో చిట్​చాట్ సందర్భంగా వాళ్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు రీతూ చౌదరి సమాధానం ఇచ్చారు. పెళ్లి ఎప్పుడు? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘అసలు పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. అప్పుడే సంతోషంగా ఉండొచ్చు’ అని రిప్లయ్ ఇచ్చారు. శ్రీకాంత్​తో మాట్లాడట్లేదా? అని ఫ్యాన్స్ అడగ్గా.. లేదన్నట్లుగా తలాడిస్తూ త్వరలోనే వివరంగా చెబుతానన్నారు రీతూ. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘లవ్వుకో దండం, నేను నాతో మాత్రమే ప్రేమలో ఉన్నా’ అని క్లారిటీ ఇచ్చారామె. దీంతో రీతూ చౌదరి తన లవర్​కు బ్రేకప్ చెప్పడం నిజమేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments