iDreamPost
android-app
ios-app

లగ్జరీ కారు కొన్ని యాంకర్ రీతూ చౌదరి.. ధర ఎంతంటే?

  • Published Jun 18, 2024 | 10:03 PM Updated Updated Jun 18, 2024 | 10:03 PM

Rithu Chowdary Bought Innova Crysta Hycross: యాంకర్ రీతూ చౌదరి ఒక లగ్జరీ కారు కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ కారు ధర ఎన్ని లక్షలు అంటే?

Rithu Chowdary Bought Innova Crysta Hycross: యాంకర్ రీతూ చౌదరి ఒక లగ్జరీ కారు కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ కారు ధర ఎన్ని లక్షలు అంటే?

  • Published Jun 18, 2024 | 10:03 PMUpdated Jun 18, 2024 | 10:03 PM
లగ్జరీ కారు కొన్ని యాంకర్ రీతూ చౌదరి.. ధర ఎంతంటే?

రీతూ చౌదరి.. ఈ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న ఇంటర్వ్యూల నుంచి సెలబ్రిటీగా, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ గా ఎదిగింది. కష్టపడితే సక్సెస్ అదే వస్తుంది అనడానికి ఈ యాంకర్ కూడా ఒక ఉదాహరణగా చెప్పచ్చు. ఈమె సీరియల్స్ కూడా చేసింది. కానీ, జబర్దస్త్ షో ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యింది. పాపులర్ కావడం మాత్రమే కాకుండా.. మంచి అవకాశాలు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు రీతూ చౌదరి ఒక లగ్జరీ కారు కొని.. తాను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడి వరకు వచ్చింది అనే విషయాన్ని తన ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా.. బుల్లితెర ఇండస్ట్రీకి కూడా తెలిసొచ్చేలా చేసింది.

రీతూ చౌదరి కొత్తగా తీసుకున్న లగ్జరీ కారు పేరు ఇన్నోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్. ప్రస్తుతం మీకు రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా ఈ ఇన్నోవా న్యూ వర్షన్ కార్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న లగ్జరీ కార్లలో ఇది కూడా ఒకటి. రీతు చౌదరి తాను కొన్న కొత్త కారు గురించి తాజాగా వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కారును డెలివరీ తీసుకుని పూజ చేసిన విజువల్స్ అన్నీ కలిపి ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశారు. అలాగే ఆ కారును డ్రైవ్ చేసుకుంటూ రీతూ వెళ్లిపోయింది.

రీతూ చౌదరి పెట్టిన వీడియోకి ఫ్యాన్స్, నెటిజన్స్ మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. రీతూ చౌదరి జిగిడీ దోస్త్ విష్ణు ప్రియ కూడా హార్ట్ సింబల్స్ పెట్టడం మాత్రమే కాకుండా.. దిష్టి తగలకూడదు అని సింబర్స్ కామెంట్ చేసింది. ఇనయా సుల్తానా, దివి వంటి వారు కూడా శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేశారు. ఇంక రీతూ చౌదరి కొనుగోలు చేసిన ఈ ఇన్నోవా క్రిస్టా హైక్రాస్ ధర విషయానికి వస్తే.. బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.24.64 లక్షలుగా ఉంది. ఇంక ఇందులోనే హైఎండ్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ రూ.38.66 లక్షలుగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

ఈ ఇన్నోవా క్రిస్టా హైక్రాస్ జెడ్ఎక్స్(ఓ) హైబ్రిడ్ టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ.45 లక్షల వరకు ఉంటుంది. అంటే యాంకర్ రీతూ చౌదరి లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లే. ఇంక రీతూ చౌదరి సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయానికి వస్తే.. ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే ఈ అమ్మడుకి 1.1 మిలియన్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. తన డైలీ లైఫ్ మాత్రమే కాకుండా.. ప్రమోషన్స్, రీల్స్, కవర్ సాంగ్స్ అంటూ ఫ్యాన్స్ అలరిస్తూ ఉంటుంది. ఇంక ఫొటో షూట్స్ తో కుర్రాళ్లను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి.. రీతూ చౌదరి లగ్జరీ కారు కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet