iDreamPost
android-app
ios-app

హీరోగా అకీరా ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన రేణు దేశాయ్!

  • Author ajaykrishna Updated - 12:21 PM, Sat - 14 October 23
  • Author ajaykrishna Updated - 12:21 PM, Sat - 14 October 23
హీరోగా అకీరా ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన రేణు దేశాయ్!

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ ల తనయుడు అకీరా నందన్ సినీ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఉన్నాడు. కాబట్టి.. రేణు దేశాయ్ ఎప్పుడు మీడియా కంటపడినా.. అందరు అడిగే ప్రశ్న.. అకీరా సినీ ఎంట్రీ ఎప్పుడు? ఈ ప్రశ్న విని తనకు విసుగు వచ్చేసిందని చెబుతోంది రేణు దేశాయ్. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణుదేశాయ్.. తనయుడు అకీరా డెబ్యూపై.. అసలు అకీరా ఏం అవ్వాలని అనుకుంటున్నాడు? హీరో అయ్యే ఆలోచన ఉందా లేదా? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చేసింది. ముందుగా తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి మాట్లాడిన ఆమె.. అకీరా, ఆధ్యాల గురించి ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

ఈ మధ్య ఎక్కడ చూసినా అకీరా గురించి చర్చలు జరుగుతున్నాయి? అతని గురించి.. అంటే సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా? హీరోగా ఎప్పుడు? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీరు ఏమంటారు? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ.. “అకీరా గురించి ఇప్పటికి చాలాసార్లు.. చాలా ఇంటర్వ్యూలలో చెప్పేసాను. తనకు సినిమాలపై పెద్దగా ఇంటరెస్ట్ లేదు. తనది వేరే ప్రపంచం. హీరోగా డెబ్యూ చేస్తానంటే.. మీ అందరికంటే ముందు ఒక తల్లిగా నేనే సంతోషిస్తాను. ఎందుకంటే.. నా కొడుకు హీరో అవుతున్నాడు అని గొప్పగా చెప్పుకోవచ్చు.

నేను చాలాసార్లు అడిగాను. ఏమైనా ఇంటరెస్ట్ ఉందా? అని. ఇలా హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు.. నీకేమైనా ఇంటరెస్ట్ ఉంటే చెప్పు అని అడిగాను. కానీ.. వాడు నో చెప్పేశాడు. అంటే.. ఫ్యూచర్ లో ఏమైనా ఛాన్స్ ఉందా అని కూడా అడిగా.. ఫ్యూచర్ గురించి ఇప్పుడే ఎలా చెప్పమంటావ్ అన్నాడు. సో.. అకీరాకు తనపై తనకు ఫుల్ క్లారిటీ ఉంది. పైగా తాను ఇప్పుడు సినిమాలకంటే కూడా మ్యూజిక్ పై ఎక్కువ ఇంటరెస్ట్ పెడుతున్నాడు. మ్యూజిక్ తర్వాత యోగా, బాక్సింగ్, ప్రాణాయామం లాంటివి ఎక్కువ చేస్తున్నాడు. కానీ.. సినిమాలైతే ప్రెజెంట్ అకీరా మైండ్ లో లేదు” అని తేల్చేసింది. ఇప్పటికైనా ఫ్యాన్స్ అర్ధం చేసుకొని.. హడావిడి చేయొద్దని ఆమె కోరారు. ప్రస్తుతం రేణుదేశాయ్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అకీరా గురించి రేణుదేశాయ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet