iDreamPost
android-app
ios-app

నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. సంచలన విషయాలు వెలుగులోకి

Jani Master Remand report: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టు అయిన జానీ మాస్టర్ కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించాడు.

Jani Master Remand report: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టు అయిన జానీ మాస్టర్ కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించాడు.

నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. సంచలన విషయాలు వెలుగులోకి

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. గోవాలో ఉన్న అతడిని హైదరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ చేపట్టారు. ఆ తర్వాత జానీని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణ చేపట్టిన కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే జానీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టు వెల్లడిస్తున్నది. 2019లో బాధితురాలు జానికి పరిచయమైందని తెలిపింది.

దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్టు రిపోర్టు వెల్లడించింది. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ 2020లో తొలిసారిగా అత్యాచారానికి పాల్పడ్డట్టు రిమాండ్ రిపోర్టు వెల్లడించింది. బాధితురాలిపై 16 ఏళ్ల వయసులో జానీ అత్యాచారానికి పాల్పడ్డట్టు కీలక అంశాలు వెలుగుచూశాయి. గత నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు వెల్లడైంది. అంతేకాదు ఈ విషయాన్ని బయటకు చెబితే సినీ అవకాశాలు రాకుండా చేస్తానని, చంపేస్తానని బాధితురాలిని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టు వెల్లడించింది. జానీ భార్య సుమలత కూడా బాధితురాలిని బెదిరించినట్లు రిపోర్టు పేర్కొంది.

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగినట్లైంది. ఇప్పటి వరకు నేను ఏ తప్పు చేయలేదంటూ బుకాయిస్తున్న జానీ పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నాడు. మరోవైపు జానీ భార్య అతను ఏ తప్పు చేయలేదని కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్న వ్యవహారమే తప్పా జానీ తప్పు చేయలేదని స్పష్టం చేసింది. జానీ ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని చెప్పుకొచ్చింది.

జానీ మాస్టర్ అసిస్టెంట్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి అని తెలిపాడు. డ్యాన్సర్స్ కు సపోర్ట్ చేస్తుంటాడని ఆపదలో అండగా ఉంటాడని వెల్లడించాడు. తప్పు జరిగినప్పుడే ఆ అమ్మాయి ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించాడు. ఐదేళ్లుగా మౌనంగా ఎందుకు ఉంది. ఈ కుట్ర వెనకాల ఎవరి హస్తమో ఉండేఉంటుందని తెలిపాడు. నిజనిజాలు ఏంటనేది కోర్టులో తేలుతుందని చెప్పాడు. మరి జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో తేలడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.