ఇండస్ట్రీలో ఒకే జానర్ కి చెందిన సినిమాలు చాలా వస్తుంటాయి. అంతెందుకు ఒక్కోసారి ఒకేలా ఉన్న స్టోరీస్ తో కూడా సినిమాలు రావడం చూస్తుంటాం. అలాగని రెండు సినిమాలు కాపీ అని అనలేం. ఎందుకంటే.. ఎంచుకునే జానర్స్ ఒకటే అయినా.. కథాకథనాలు వేరుగా ఉంటాయి. ఒకవేళ స్టోరీ పాయింట్ కూడా సేమ్ అనిపించినా.. సినిమాలలో ఆయా ఇండస్ట్రీలు బట్టి.. ఇచ్చే ట్రీట్మెంట్ మారిపోతుంది. స్పై జానర్ వచ్చిన సినిమాలన్నీ జేమ్స్ బాండ్ కి చెందినవే అని చెప్పలేం కదా! సో, అలాగే ఇప్పుడు పాన్ ఇండియా హిట్ పుష్ప సినిమాలోని ప్రధాన ఇతివృత్తంతో తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది.
ఆ సినిమా పేరే ‘రెడ్ శాండల్ వుడ్’. టైటిల్ వినగానే ఓ క్లారిటీ వచ్చిందా.. ఈ సినిమా కూడా పుష్పలాగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతుంది. గురు రామానుజం దర్శకత్వం వహించిన ఈ సినిమా.. జే. పార్థసారథి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ నటుడు వెట్రి ప్రధానపాత్ర పోషిస్తుండగా.. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కాగా.. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఆరోపణలకు గురైన ఎందరో అమాయకుల లైఫ్ నేపథ్యంలో సినిమా రూపొందింది. 2015లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కింది.
ఇక పుష్ప సినిమాలో లాగా ఈ సినిమా కూడా ఎర్ర చందనం నేపథ్యంలో వస్తుందని తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలు పెట్టేశారు. అయితే.. ఈ సినిమాని ఎవరో చేసిన రెడ్ శాండల్ వుడ్ స్మగ్లింగ్ లో.. అమాయక జనాలు ఎలా బాధించబడ్డారు? అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ మధ్యకాలంలో బాగా నేచురాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు.. కంటెంట్ ఉన్న సినిమాలే ఆడుతున్నాయి. మరి గురు రామానుజం రూపొందించిన ఈ సినిమాలో.. వెట్రి, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి పుష్ప తర్వాత రెడ్ శాండల్ వుడ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.