iDreamPost
android-app
ios-app

పెద్ది ఇంత స్పీడ్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది ?

  • Published Sep 02, 2025 | 11:39 AM Updated Updated Sep 02, 2025 | 11:39 AM

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ప్రమోషన్స్ కు అతీతం కాదు. నిజం సినిమా రిలీజ్ కు ముందు సినిమాను జనాల్లో రిజిస్టర్ చేయడం చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితిల్లో అయితే అది అత్యంత కీలకం కూడా. సినిమా ఇంకో నెల రెండు నెలల్లో రిలీజ్ ఉందంటే హై స్పీడ్ ప్రమోషన్స్ యూజ్ అవుతాయి

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ప్రమోషన్స్ కు అతీతం కాదు. నిజం సినిమా రిలీజ్ కు ముందు సినిమాను జనాల్లో రిజిస్టర్ చేయడం చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితిల్లో అయితే అది అత్యంత కీలకం కూడా. సినిమా ఇంకో నెల రెండు నెలల్లో రిలీజ్ ఉందంటే హై స్పీడ్ ప్రమోషన్స్ యూజ్ అవుతాయి

  • Published Sep 02, 2025 | 11:39 AMUpdated Sep 02, 2025 | 11:39 AM
పెద్ది ఇంత స్పీడ్ అవ్వడానికి రీజన్  ఏమై ఉంటుంది ?

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ప్రమోషన్స్ కు అతీతం కాదు. నిజం సినిమా రిలీజ్ కు ముందు సినిమాను జనాల్లో రిజిస్టర్ చేయడం చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితిల్లో అయితే అది అత్యంత కీలకం కూడా. సినిమా ఇంకో నెల రెండు నెలల్లో రిలీజ్ ఉందంటే హై స్పీడ్ ప్రమోషన్స్ యూజ్ అవుతాయి. కానీ ఇంకా ఏడు నెలల సమయం ఉంచుకుని.. పెద్ది అప్పుడే ఇంత తొందర ఎందుకు పడుతున్నాడు అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. పెద్ది సినిమా రిలీజ్ డేట్ మార్చి 27 అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అంటే తీరిగ్గా సంక్రాంతి తర్వాత ప్రొమోషన్స్ మొదలుపెట్టుకోవచ్చు.

కానీ డైరెక్టర్ బుచ్చి బాబు ఆలోచన కాస్త అడ్వాన్స్డ్ గా ఉన్నట్లు ఉంది. దసరాకో దీపావళికో ఫస్ట్ ఆడియో సింగిల్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట టీమ్. దాని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని టాక్. అలాగే ఏ ఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు అద్భుతంగా వచ్చాయట. అవి నెలల తరబడి ట్రెండింగ్ లో ఉంటాయని యూనిట్ సభ్యులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్. సో ఆరు నెలల ముందు సాంగ్స్ వదలడం పెద్ది కి అటెన్షన్ తెచ్చిపెడుతుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ అయితే కనుక.. పెద్దికి వచ్చే రెస్పాన్స్ అదిరిపోతోంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సో ఈసారి బుచ్చి బాబు పక్కా ప్లానింగ్ తో పెద్దిని జనాల్లోకి తీసుకుని వస్తున్నాడు. రంగస్థలం కు మించిన ఔట్పుట్ ఇస్తానని ఆల్రెడీ ఈ దర్శకుడు మాట ఇస్తున్నాడట. దీనిని బట్టే అర్థంచేసుకోవచ్చు పెద్దితో రామ్ చరణ్ కెరీర్ లో మరో హిట్ కన్ఫర్మ్ అని. ఇక ముందు ముందు వచ్చే అప్డేట్స్ ఎలాంటి వైబ్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.